Adikeshava OTT: వైష్ణవ్ తేజ్ ఆదికేశవ ఓటీటీలో వచ్చేసింది, ఎప్పట్నించి, ఎందులోనంటే

Adikeshava OTT: ఓటీటీలో మరో కొత్త సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఉప్పెనతో ఫేమ్ తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ నటించిన ఈ టాలీవుడ్ సినిమా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 18, 2023, 05:56 PM IST
Adikeshava OTT: వైష్ణవ్ తేజ్ ఆదికేశవ ఓటీటీలో వచ్చేసింది, ఎప్పట్నించి, ఎందులోనంటే

Adikeshava OTT: ఉప్పెన నటుడు మెగా కుటుంబం నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ నటించిన మరో సినిమా ఆదికేశవ మరో నాలుగు రోజుల్లో డిసెంబర్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కించాడు. సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను నిర్మించారు. జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ మాస్ రూపంలో కన్పించాడు. భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన సినిమా ఆశించిన మేర ప్రభావం చూపించలేక చతికిలపడింది. కధ, కధనంలో కొత్తదనం లేక, విలన్‌పై ప్రతీకారం కోసం సీమలో అడుగుపెట్టడమనే మూస ధోరణిలో సినిమా కొనసాగడం వల్ల ఆశించిన అంచనాలను చేరుకోలేకపోయిందని తెలుస్తోంది. 

డిసెంబర్ 22 నుంచి ఆదికేశవ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ధియేటర్లలో విఫలమైన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని ఆదరిస్తుందో లేదో చూడాలి. సినిమాపై పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా కాలక్షేపం కోసం చూసేవారికి ఎలాంటి నిరాశ కలగకపోవచ్చు. ఈ వారం ఓటీటీల్లో విడుదలవుతున్న 30 సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో ఇదొకటిగా పరిగణించవచ్చు.

Also read: OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న 30 సినిమాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News