RAM: ‘రామ్’తో రానున్న సూర్య అయ్యలసోమయాజుల..అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోనున్న దేశభక్తి చిత్రం..

Surya Somayajulu: దేశభక్తి సినిమాలు ఎన్ని వచ్చినా మన తెలుగు ప్రేక్షకులు వాటిని ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు. ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రాబోతోంది మరో దేశభక్తి సినిమా రామ్..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2024, 12:48 PM IST
RAM: ‘రామ్’తో రానున్న సూర్య అయ్యలసోమయాజుల..అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోనున్న దేశభక్తి చిత్రం..

RAM: ‘రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) ’ అంటూ మంచి దేశభక్తి కథతో మన ముందుకి రాబోతున్నాడు హీరో సూర్య అయ్యలసోమయాజుల. రిప్లబిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా  రూపొందిస్తున్నారు. 

ఈ చిత్రంతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. సూర్య అయ్యలసోమయాజుల తొలి సినిమా అయినా ఈ చిత్రం ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు. సినిమా రిలీజ్‌ సందర్భంగా హీరో  సూర్య అయ్యలసోమయాజుల మీడియాతో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు..

‘చిన్నప్పుడు నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. తేజ తీసిన కేక చిత్రంలో నటించాను. ఆ తరువాత కుటుంబ సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాను. మళ్లీ ఇప్పుడు సినీ కెరీర్‌ను ప్రారంభించాను. కరోనా టైంలోనే మూవీస్ కోసం ఆడిషన్స్ ఇస్తూ వచ్చాను. అలా గేమ్ చేంజర్ సినిమాలోనూ అవకాశం రావడంతో నటించాను. కేక మూవీ సినిమాకు మిహిరాం అసిస్టెంట్‌గా పని చేశారు. ఆ పరిచయంతోనే ఈ కథ నా వద్దకు వచ్చింది. మిహిరాంతో నాది పది, పదిహేనేళ్ల అనుబంధం. మిహిరాం కూడా తన కథలు పట్టుకుని ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతుండేవారు. అలా మా ఇద్దరి జర్నీ ఈ రామ్ సినిమాతో ప్రారంభం అయింది' అని తన సినిమా జర్నీ తెలియజేశారు.

‘రామ్ సినిమాకు ఆర్థిక కష్టాలు వచ్చాయి. ముందు వేరే నిర్మాత ఉండేవారు. కానీ ఆ తరువాత మా ఫ్రెండ్స్ చిత్రాన్ని పూర్తి చేశాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారంతోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయగలిగాను.
కో-డైరెక్టర్ సాయంతో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమాకు ఆడిషన్ ఇచ్చాను. రామ్ చరణ్ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. కెరీర్ స్టార్టింగ్‌లోనే శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడితో పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది'. అని చెప్పుకొచ్చాడు.

‘ నా చిన్నప్పుడు నుంచి ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్‌ల మీద ఇంట్రెస్ట్. ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తుండేవాడ్ని. అందుకే ఈ సినిమాలో ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేయగలిగాను. ఎక్కడా కూడా డూప్‌ను వాడలేదు. అన్నీ సొంతంగానే చేశాను. ఫైట్స్ సీక్వెన్స్ చేసిన టైంలో ఎన్నో గాయాలయ్యాయి.రామ్ చిత్రం ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉంటుంది. మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది. సోషల్ మెసెజ్ ఇస్తూనే కమర్షియల్ ఫార్మాట్‌లో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రామ్ చిత్రాన్ని తెరకెక్కించాం' అని తెలియజేశారు ఈ హీరో.

Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News