NTR as villain for Hrithik Roshan: దీపావళి పండగ సంధర్బంగా బాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా టైగర్ 3. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా తోలి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్ళని రాబడుతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ వాళ్ళు సృష్టించిన స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా చేశారు. ఇప్పటికే వార్, పఠాన్ వంటి సినిమాలు ఈ యూనివర్స్ నుంచి వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు టైగర్ 3 క్లైమాక్స్ లో వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ రోల్ గురించి ఒక ఆసక్తికర వార్తని బయట పెట్టేశారు సినిమా టీమ్. సల్మాన్ ఖాన్ టైగర్ 3 క్లైమాక్స్ విషయానికి వస్తే.. ఒక గ్యాంగ్ ని చంపడానికి వార్ మూవీ లో కబీర్ గా నటించిన హృతిక్ రోషన్ వస్తాడు. ఈ క్లైమాక్స్ అనేది వార్ 2 కి లీడ్ చేస్తుంది. అయితే ఈ క్లైమాక్స్ లో హృతిక్ రోషన్ కి వచ్చే టాస్క్ ఏంటంటే, ఇండియా కి ఒక వ్యక్తి రూపం లో పెను ప్రమాదం ఉందని, ఆ వ్యక్తి చావు కంటే చాలా భయంకరంగా ఉంటాడని హృతిక్ కి ఒక ఏజెంట్ చెప్తాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఆ వ్యక్తి ఎవరో కాదు మన ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించే అని అర్థం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ 2 అనే సినిమా అనౌన్స్ అయ్యింది. కాగా ఈ సినిమా ప్రకటన బయటకి వచ్చిన దగ్గరనుంచి..ఈ స్పై యూనివర్స్ లో అసలు ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర పోషిస్తాడు, ఎలా ఉంటాడు అనే ప్రశ్నలు అందరిలో ఉండేవి. కానీ టైగర్ 3 క్లైమాక్స్ చూసాక అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ ఈ సినిమా లో ఒక ఖరడుగట్టిన విలన్ గా ఉండబోతున్నాడు అని.
ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న వార్ 2 మూవీ లో ఎన్టీఆర్ విలన్ రోల్ చేయబోతున్నాడు అనే హింట్ రాగానే ఆ అంచనాలు మరింత పెరిగాయి. హీరో గా ఎన్నో పాత్రల్లో తనదైన శైలిలో నటించి మెప్పించిన ఎన్టీఆర్, విలన్ గా మారి ఎలాంటి నట విశ్వరూపం చూపిస్తాడో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి