Bigg Boss Telugu 5: ఈ 5 గురి కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?? వైరల్!

ఇంకా రెండు రోజులు మాత్రమే.. ప్రముఖ ఛానల్ లో రాబోతున్న బిగ్‌బాస్‌.. ఒక న్యూస్ మాత్రం తెగ హల్ చల్ చేస్తుంది. అదేంటంటే 5 గురు కంటెస్టెంట్లు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట..? వాల్లెవరో, ఆ న్యూస్ ఏంటో చూసేద్దమా మరీ!

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 3, 2021, 04:50 PM IST
  • రెండు రోజుల్లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌ సీజన్ 5
  • అత్యధిక రెమ్యునరేషన్ వీళ్లకే అంటూ సోషల్ మీడియాలో వార్తలు
  • షో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులు
Bigg Boss Telugu 5: ఈ 5 గురి కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?? వైరల్!

Bigg Boss Telugu 5: భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా.. ఈ షో ప్రారంభం అయ్యాక టి‌ఆర్‌పి రేటింగ్ (TRP Ratings) ఒక రేంజ్ లోకి వెళ్తాయి.. ఇదేం షో అనుకుంటున్నారా?? అదేనండి బిగ్‌బాస్‌  షో.. (Bigg Boss Telugu 5) హిందీ (Hindi) , తమిళ (Tamil), కన్నడ (Kannada), మళయాళ (Malayalam) భాషాలలో చాలా ప్రాముఖ్యం పొందిన ఈ షో మన తెలుగులో సీజన్ 5 ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. 

మొదటగా ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, నాని తరువాత అక్కినేని నాగార్జున చేసిన నాలుగు సీజన్లు విజయవంతం అవగా... ఇపుడు మళ్లీ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న సీజన్ 5  గురించి చాలా రోజుల నుండి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 

Also Read: Scary video: పైకప్పులోంచి వేలాడుతున్న "దెయ్యం తల".... తరువాతేం జరిగింది??

బిగ్‌బాస్‌ షో గురించి రోజుకో కొత్త వార్త ఇండస్ట్రీలో (Tollywood) చక్కర్లు కొడుతుంది. ఈ రోజు ఏ వార్త హాల్ చల్ చేస్తుందంటే... బిగ్ బాస్ యూనిట్ ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్లను (Bigg Boss 5 contestants 5) ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. వారిలో  కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి, అనీ మాస్టర్, షణ్ముఖ్ జశ్వంత్, యాంకర్ రవి, సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ, నటరాజ్ మాస్టర్, శ్వేతా వర్మ, ఉమాదేవి, మానాస్, వి.జె.సన్నీ, ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, ఆర్జే కాజల్, లహరి, సిరి హనుమంత్, సరయు బిగ్‌బాస్‌ హౌస్ లోకి వెళ్తున్నారు. 

ప్రస్తుతం వీరందరూ  క్వారంటైన్‌లో ఉండగా..  ఈ నెల 5 తేదీనా బిగ్‌బాస్‌ ఇంట్లోకి (Bigg Boss House) వెళ్తున్నారు. ఒకేసారి 16 మంది వెళ్తున్నట్లు సమాచారం. 

Also Read: Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో పథకం.. రజతం సాధించిన ప్రవీణ్ కుమార్

ఇక విషయానికి వస్తే.... షణ్ముఖ్ జశ్వంత్, యాంకర్ రవి, అనీ మాస్టర్,  ఉమాదేవి, ఆర్టిస్ట్ ప్రియ అత్యధిక రెమ్యునరేషన్  తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. వీరు వారానికి 40 వేల రూపాయలు తీసుకుంటున్నారనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతానికి దీనిపై బిగ్‌బాస్‌ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News