Actress Ashmita : బెంజ్ కారు కొన్న బుల్లితెర నటి.. ఆనందంలో అశ్మిత.. ధర ఎంతంటే?

TV Actress Ashmita Buys Benz Car ప్రస్తుతం బుల్లితెర తారలంతా కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇన్ స్టా, యూట్యూబ్ అంటూ హంగామా చేస్తున్నారు. నటి అశ్మిత తాజాగా బెంజ్ కారు కొనేసింది. దాని గురించి చెబుతూ ఇన్ స్టాలో వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2023, 01:02 PM IST
  • సోషల్ మీడియాలో బుల్లితెర తారలు
  • కొత్త కారు, కొత్తింటితో సెలెబ్రిటీల హంగామా
  • బెంజ్ కారు కొన్న నటి అశ్మిత
Actress Ashmita : బెంజ్ కారు కొన్న బుల్లితెర నటి.. ఆనందంలో అశ్మిత.. ధర ఎంతంటే?

TV Actress Ashmita Buys Benz Car టీవీ ఆర్టిస్టులంతా కూడా ఇప్పుడు యూట్యూబ్, ఇన్ స్టాగ్రాం అంటూ బిజీగా అవుతున్నారు. బుల్లితెరపై సీరియల్స్‌ షూటింగ్, లొకేషన్స్‌లో చేసే సందడిని యూట్యూబ్‌లో వీడియోలుగా పెడుతున్నారు. ట్రావెలింగ్ వ్లాగ్స్, హోం టూర్లు అంటూ బుల్లితెర సెలెబ్రిటీలు బాగానే సందడి చేస్తున్నారు. ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటుగా యూట్యూబ్ చానెళ్ల ద్వారా ఆదాయాన్ని కూడా పెంచుకుంటున్నారు.

అలా బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి అశ్మిత. మనసు మమత సీరియల్ నుంచి అశ్మితకు మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమాలు, సీరియల్స్‌లోనూ అశ్మిత నటించింది. ఇప్పటికీ పలు సీరియల్స్‌లో అశ్మిత సందడి చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో తన భర్త, ఫ్యామిలీతో కలిసి వెసే వెకేషన్లకు, షేర్ ఫోటోలకు ఎక్కువగా కామెంట్లు వస్తుంటాయి. తాజాగా తమ ఇంట్లోకి వచ్చిన కొత్త ఆనందం గురించి అశ్మిత షేర్ చేసింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashmita karnani (@ashmita_9)

ఈ బ్యూటీని నిన్న ఇంటికి తీసుకొచ్చాం.. లైవ్ వ్లాగ్ రెడీ అయింది.. నా మనసు సంతోషంతో నిండిపోయింది.. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరి మొహాల్లో సంతోషం కనిపించింది.. మహవీర్ మోటార్స్ యూనిట్‌కు థాంక్స్.. ఎంతో గొప్పగా రిసీవ్ చేసుకున్నారు.. మాకు ఎంతో మధురానుభూతిని కలిగించారు.. అంటూ ఇలా తన సంతోషాన్ని అశ్మిత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Also Read:  Ananya Nagalla : అనన్య తడి అందాలు.. చూస్తే వామ్మో అనాల్సిందే.. అందరి ఫోకస్ అక్కడే

ఇక అశ్మిత కొన్న కొత్త కారుని చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తోటి నటీనటులు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వితిక షెరు, మెరినా వంటి వారు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేశారు. ఇక ఈ కారు ధరు కనిష్టం నలభై లక్షలు గరిష్టంగా డెబ్బై లక్షలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆశ్మిత ఎన్ని లక్షలు పెట్టి ఈ కారు కొనేసిందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Also Read:  Naga Chaitanya : పోతుందని తెలిసి కూడా ప్రమోషన్స్ చేయడం కష్టం!.. థాంక్యూపై నాగ చైతన్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News