Telugu Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజయ్యే తెలుగు సినిమాలివే

Telugu Movies Releasing in Theaters and OTT This Week: ఈ వారం తెలుగులో విడుదల అవుతున్న సినిమాల మీద ఒక లుక్కు వేద్దాం. ఈ వారం థియేటర్లలో అలాగే డిజిటల్ లో కూడా విడుదల అవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2022, 12:38 PM IST
Telugu Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజయ్యే తెలుగు సినిమాలివే

Telugu Movies Releasing in Theaters and OTT This Week: తెలుగులో పెద్ద సినిమాలు ఇప్పటికే విడుదల కావడంతో చిన్న సినిమాలన్నీ విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఖాళీగా దొరుకుతుందా? సినిమాలను ఎప్పుడు విడుదల చేయాలా? అని నిర్మాతలు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతానికి షూటింగ్స్ కూడా నిలిచిపోయిన నేపథ్యంలో ఇప్పటికే పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న అన్ని సినిమాలను టైం చూసుకుని విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు,  ఇక ఈవారం అంటే ఆగస్టు 5వ తేదీన కొన్ని ఆసక్తికరమైన సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది.

థియేట్రికల్ రిలీజులు:

అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే బింబిసార అనే సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కళ్యాణ్ రామ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ కోసం నిర్మిస్తున్న బింబిసార సినిమా అటు నందమూరి అభిమానులకే కాక తెలుగు ప్రేక్షకులందరికీ ఆసక్తికరంగా మారింది. ఒకప్పటి నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు మల్లిడి వశిష్ట్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్,  కేథరిన్ థెరిసా వరీనా న హుస్సేన్ వంటి వారు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేయగా సినిమా చూసిన ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు కూడా సినిమా మీద అంచనాలను రెట్టింపయ్యేలా చేశాయి.

ఇక మరో సినిమా సీతారామం విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ నేరుగా లీడ్ రోల్ లో చేస్తున్న మొట్టమొదటి తెలుగు సినిమా ఇది. మృణాల్ ఠాకూర్ ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్ ఉండడంతో సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాక ట్రైలర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యేలా చేసింది. తెలుగు,  తమిళ,  మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేయబోతున్నారు.

డిజిటల్ రిలీజ్:

ఇక ఈ వారం డిజిటల్ వేదికగా విడుదల కాబోతున్న తెలుగు సినిమాల విషయానికి వస్తే ముందుగా గోపీచంద్ హీరోగా రూపొందిన పక్కా కమర్షియల్ సినిమా ఆహా వీడియో వేదికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ నుంచి ఆహాలో సందడి చేయబోతోంది. హన్సిక నటించిన మహా సినిమా కూడా ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా కూడా తమిళ,  తెలుగు భాషలలో ఆహా వీడియోలో అందుబాటులోకి రాబోతోంది. ఇక అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా తెరకెక్కిన కడువా అనే సినిమా కూడా ఆగస్టు 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఈ సినిమా తమిళ,  తెలుగు,  కన్నడ,  మలయాళం,  హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదలైంది. ఇక అలియాబట్ హీరోయిన్ గా నటించిన డార్లింగ్స్ సినిమా కూడా ఆగస్టు 5వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో అందు బాటులోకి రాబోతోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.

Read Also: Vijay Devarakonda:ఇదెక్కడి క్రేజ్‌రా అయ్యా.. విజయ్ దేవరకొండకి ముంబైలో మెంటల్ మాస్ ఫాలోయింగ్

Read Also: NTR Family: ఎన్టీఆర్ కుటుంబానికి అసలు కలిసిరాని ఆగస్టు.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో వరుస మరణాలు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News