Sankranthi Releases 2024: సంక్రాంతి సినిమాల సంబరాలు మొదలవ్వడానికి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. దాదాపు నాలుగు భారీ తెలుగు చిత్రాలు ఈ సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాగా మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు వస్తున్న ఈ సంక్రాంతికి చిన్న హీరో తేజ కూడా తన హనుమాన్ తో రాబోతున్నారు.
ఈ సినిమా టీజర్ విడుదలైన దగ్గర నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం పైన ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా మేకర్స్.. స్టార్ హీరోల సినిమా మధ్య కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ముఖ్యంగా నార్త్ సైడ్ మంచి ఆసక్తి కనిపిస్తుంది. కాగా ఈ సినిమా టికెట్ రేట్లను తెలుగు రాష్ట్రాలలో ఫిక్స్.. చేసి ఆ వివరాలు విడుదల చేయగా.. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈమధ్య కాలంలో తెలుగు స్టేట్స్ లో సినిమా రిలీజ్ మొదటి వారంలో టికెట్ రేటు పెంచే ఆనవాయితీ ఒకటి అలవాటు అయ్యింది. సలార్ సినిమాకి నిన్న మొన్నటి వరకు విపరీతమైన టికెట్లు రేట్లు ఉండగా రెండు వారాలు అయ్యాక వాటిని తగ్గించిన సంగతి తెలిసిందే. ఇక గుంటూరు కారంకి కూడా ఇలానే గవర్నమెంట్ రూల్ ఇవ్వచ్చు అని అందరూ అనుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆయా సినిమాల బడ్జెట్ లు బట్టి టికెట్ ధరలు నిర్ణయిస్తున్నారు అనే టాక్ కూడా నడుస్తోంది. మరి రిలీజ్ కి సిద్దమవుతున్న హనుమాన్ టికెట్ ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేసేయండి.
తెలంగాణలో హైదరాబాద్ సిటీ తప్పించి మిగిలిన అన్ని ఏరియాల్లో సింగల్ స్క్రీన్ టికెట్ ధర రూ.110 ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ లో మాత్రం రూ.150కి పెట్టినట్లు సమాచారం. మల్టీప్లెక్స్ లు విషయానికి వస్తే.. అన్ని చోట్ల రూ.295కి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతికి ఈ సినిమాతో రిలీజ్ అవుతున్న సినిమాలకు ఈ రేట్లకు మించి టికెట్స్ ధరని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.
ఇదే విషయం కానీ నిజమైతే…మొత్తం పైన సంక్రాంతి సినిమాలలో తక్కువ టికెట్ ధరలు ఈ చిత్రానికే ఉంటాయి. ఇది అన్యాయం అని కొంతమంది భావిస్తుండగా మరి కొంతమంది మాత్రం ఇదే ఈ సినిమాకి ప్లస్ అవుతుంది అని అంటున్నారు. టికెట్ ధరలు తక్కువ ఉండడం ..ఈ సినిమాకి కలిసొచ్చే అంశం అవుతుందని.. ఎందుకంటే ఈ సినిమా టాక్ కానీ మంచిగా వస్తే.. టికెట్ ధర కూడా తక్కువ ఉండటంతో ప్రేక్షకులు ఎక్కువగా ఈ చిత్రం చూడడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారని అంటున్నారు నెటిజన్స్.
మొత్తానికి పండక్కి ప్రతి ఒక్కరు చూసేలా హనుమాన్ ధరలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూద్దాం.
Also read: Kesineni Nani: టీడీపీకు రాజీనామా చేయనున్న కేశినేని నాని, వైసీపీలో చేరనున్నారా
Also Read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Hanu-Man: హనుమాన్ టికెట్ రేట్లు ఫిక్స్ ఇవే.. మరీ ఇంత తక్కువా..!