Tammareddy Bharadwaja Clarity: ఆర్ఆర్ఆర్ కామెంట్లపై తమ్మారెడ్డి క్లారిటీ.. అసలు విషయం ఇదే అంటూ!

Tammareddy Clarity about RRR: ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ చిత్రం మీద తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన క్రమంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 10, 2023, 05:08 PM IST
Tammareddy Bharadwaja Clarity: ఆర్ఆర్ఆర్ కామెంట్లపై తమ్మారెడ్డి క్లారిటీ.. అసలు విషయం ఇదే అంటూ!

Tammareddy Clarity on Comments about RRR: ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ చిత్రం మీద తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా చిన్న సినిమాలను ప్రోత్సహించే కార్యక్రమానికి వెళ్ళిన తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ అమెరికా వెళ్లి లాబీయింగ్ కోసం 80 కోట్లు ఖర్చు పెడుతుందని, ఇప్పటి దాకా ఫ్లయిట్ టికెట్ల కోసమే ఆ 80 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

ఆ 80 కోట్లు తమకు ఇస్తే పది చిన్న సినిమాలు తీసి మీ మొఖాన కొడతాం అంటూ ఆయన మాట్లాడినట్లుగా ఉన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు సైతం ఆయన మీద ఘాటుగా స్పందించారు. నీ అమ్మ మొగుడు ఈ 80 కోట్లు ఖర్చు పెట్టాడా? అంటూ తమ్మారెడ్డి భరద్వాజను ఉద్దేశిస్తూనే ఆయన పేరు ప్రస్తావించకుండా కౌంటర్ ఇచ్చారు. మరోపక్క దర్శకేంద్రుడికి రాఘవేంద్రరావు సైతం కౌంటర్ ఇచ్చారు.

అంటే నీ ఉద్దేశం అమెరికాలో టాప్ దర్శకులకు డబ్బులు ఇచ్చి సినిమా పొగడమని అడుగుతున్నారా? అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ విషయం మీద తమ్మారెడ్డి భరద్వాజ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా మీద నేను ఎలాంటి కామెంట్స్ చేయలేదని ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇస్తానని ఆయన పేర్కొన్నారు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేద్దాం అనే కాంటెక్స్ట్ లో నేను చెప్పాను తప్పితే వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకుంటే నాకెందుకు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ కౌంటర్ ఇచ్చారు.

దీనికి సంబంధించి వీలైనంత త్వరగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ ఇప్పుడు ఆస్కార్ అవార్డుల వేడుకకు వెళ్ళింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ సహా రాజమౌళి కుమారుడు కార్తికేయ అక్కడే ఉన్నారు. వారు వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కోసమే 80 కోట్ల వరకు ఖర్చయిందని వాటితో పది సినిమాలు చేయవచ్చని తమ్మారెడ్డి భరద్వాజ్ కామెంట్లు చేసినట్లుగా ప్రచారం జరిగితే నా ఉద్దేశం అది కాదని ఆయన అంటున్నారు. మరి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Naresh Pavitra Marriage: నరేష్ -పవిత్ర పెళ్లి నిజం కాదు.. బకరాలని చేశారుగా!

Also Read: Actor Naresh Honeymoon: దుబాయ్ లో హనీమూన్ కు నరేష్, పవిత్ర లోకేష్.. ఎక్కడా తగ్గట్లేదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 

Trending News