Balamithran: హార్ట్ ఎటాక్‌తో యువ దర్శకుడు మృతి

Tamil director Balamithran | లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ లేకపోవడం, చేస్తున్న సినిమాల పనులు మధ్యలోనే ఆగిపోవడం వంటి పరిణామాలు సినీ కళాకారులను తీవ్ర మానసిక ఒత్తిడికి (Mental stress) గురిచేస్తున్నాయి. కొంతమంది ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇంకొంత మంది వాటిలోంచి బయటికి రాలేకపోతున్నారు.

Last Updated : Jun 11, 2020, 01:15 PM IST
Balamithran: హార్ట్ ఎటాక్‌తో యువ దర్శకుడు మృతి

Tamil director Balamithran | కరోనావైరస్ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్ విధించగా.. అదే సమయంలో షూటింగ్స్ లేకపోవడం, చేస్తున్న సినిమాల పనులు మధ్యలోనే ఆగిపోవడం వంటి పరిణామాలు సినీ కళాకారులను తీవ్ర మానసిక ఒత్తిడికి (Mental stress) గురిచేస్తున్నాయి. కొంతమంది ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇంకొంత మంది వాటిలోంచి బయటికి రాలేకపోతున్నారు. అటువంటి ఒత్తిళ్లతోనే గుండెపోటుకు గురైన ఓ తమిళ దర్శకుడు.. అదే వేదనతో కన్నుమూశారు. ఉడుక్కై (Udukkai) అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన బాలమిత్రన్ అనే యువ దర్శకుడు... ఆ సినిమా ఇంకా పూర్తికాక ముందే హార్ట్ ఎటాక్‌తో (Heart attack) చనిపోయారు. అంతకంటే ముందుగా గుండెనొప్పితో బాధపడుతున్న బాలమిత్రన్‌ని తొలుత చికిత్స కోసం వడపలనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. అక్కడ చికిత్సకు ఖరీదు ఎక్కువవడంతో ఆ ఖర్చును భరించలేక అతడిని కాటంగులతూరులోని ఎస్ఆర్ఎం ఆస్పత్రిలో చేర్పించారు. డైరెక్టర్స్ యూనియన్ ఇందుకు సహకరించినట్టు సమాచారం. కానీ గుండెనొప్పి తీవ్రం కావడంతో ఆ నొప్పితోనే బాలమిత్రన్ చివరకు తుదిశ్వాస విడిచారు. బాలమిత్రన్‌కి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. Amitabh Bachchan: వలసకూలీల కోసం 6 ఛార్టర్డ్ ఫ్లైట్స్ )

బాలమిత్రన్ డైరెక్ట్ చేస్తున్న ఉడుక్కై చిత్రం ప్రస్తుతం 95 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో 5 రోజుల షూటింగ్ మిగిలి ఉందనగా లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. అప్పటి నుంచి సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ షూటింగ్ మిగిలిపోయిందే అనే ఆవేదన బాలమిత్రన్‌ని తీవ్రంగా వేధించినట్టు అతడి మిత్రులు చెబుతున్నారు. Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )

బాలమిత్రన్ మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. కోవిడ్-19 వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో సినిమా కళాకారులు ధైర్యంగా ఉండి పరిస్థితులను ఎదుర్కోవాల్సిందిగా పలువురు కోలీవుడ్ సినీ పెద్దలు విజ్ఞప్తి చేశారు. బాలమిత్రన్ తెరకెక్కిస్తున్న ఉడుక్కై చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సంజన సింగ్ ( Actress Sanjana Singh).. దర్శకుడి మృతి వార్తను ట్విటర్‌లో పోస్ట్ చేసి.. దర్శకుడికి నివాళి అర్పించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News