Jayam Ravi - Aarti Divorce: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారో తెలియదు, ఎప్పుడు విడిపోతారో తెలియదు. కారణాలు ఏవైనా సరే వివాహం జరిగిన తర్వాత వైవాహిక బంధం లో సంవత్సరాల పాటు కలిసి వున్న వారు విడాకుల పేరిట విడిపోతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో సమంత, నాగచైతన్య నాలుగు సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు.
ఆ తర్వాత 18 సంవత్సరాల పాటు కలిసి జీవించిన ధనుష్ , ఐశ్వర్య కూడా విడిపోయారు. ఇప్పుడు జీవి ప్రకాష్ కూడా తన భార్యతో విడిపోయి ఆశ్చర్యపరిచారు. అయితే ఈ షాకింగ్ ఘటనల నుంచి ఇంకా తేరుకోకముందే మరో స్టార్ హీరో కూడా భార్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు.
ఆయన ఎవరో కాదు తమిళ స్టార్ హీరో జయం రవి. ఆయన భార్య ఆర్తి నుంచీ విడాకులు తీసుకుంటున్నారు. తమ దాంపత్య బంధానికి పులిస్టాప్ పెడుతూ విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి ప్రకటించారు. వ్యక్తిగత కారణాలవల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు .ఇక ఈ విషయంలో ఎలాంటి పుకార్లు, ఆరోపణలు చేయవద్దని దయచేసి తమ ఈ విడాకుల విషయానికి ప్రైవసీ కావాలి అంటూ కోరారు.ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ జయం రవి భార్య ఆర్తి ఒక పోస్ట్ షేర్ చేసింది.
Grateful for your love and understanding.
Jayam Ravi pic.twitter.com/FNRGf6OOo8
— Jayam Ravi (@actor_jayamravi) September 9, 2024
అయితే ఈ విషయం తెలిసి ఆనంద పడేలోపే ఇప్పుడు మరొకసారి జయం రవి చేసిన పోస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంత సడన్ గా విడాకులు తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు అభిమానులు.ఈ క్రమంలో 2023 నుంచి వీరిద్దరి మధ్య చిన్న గొడవలు జరుగుతున్నాయని.. ఎవరెంత ట్రై చేసిన.. జయం రవి భార్య మాత్రం కలవడానికి ఒప్పుకోలేదని.. ఫైనల్ గా తన ఇంస్టాగ్రామ్ ఫోటోలు కూడా ఈ సంవత్సరం మొదట్లో డిలీట్ చెయ్యదంటే.. వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూనే వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే జయం రవి ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాతో నేషనల్ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. 2003లో జయం సినిమాతో నటుడిగా చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైనప్పటి నుంచి జయం రవిగా పేరు మార్చుకొని చలామణి అవుతున్నారు. తెలుగులో కూడా పలు చిత్రాలు చేస్తున్నారు. ఇక 2009లో జయం రవి, ఆర్తి వివాహం చేసుకోగా.. అరవ్ , అయాన్ అనే ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. ఇక ఇప్పుడు విడిపోతున్నాం అంటూ ప్రకటించి జయం రవి ఆశ్చర్యపరిచారు.
Also Read: Actor Vinayakan: వినాయక చవితి రోజే 'జైలర్' నటుడు వినాయకన్ అరెస్ట్..
Also Read: AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.