Tamannaah Bhatia Photoshoot : మతి పోగొట్టేస్తోన్న మిల్కీ బ్యూటీ.. దీపావళి కాంతులన్నీ తమన్నా కళ్లలోనే

Tamannaah Bhatia Photoshoot తమన్నా ప్రస్తుతం ఫోటో షూట్లతో కుర్రాళ్ల ప్రాణాలను తీస్తోంది. దివాళి సందర్భంగా ఆమె చేసిన ఫోటో షూట్లు చూసి జనాలు ఫిదా అవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2022, 05:47 PM IST
  • దీపావళి కాంతుల్లో తారల సందడి
  • తమన్నా ఫోటో షూట్ వైరల్
  • మిల్కీ బ్యూటీ ఎద అందాల ప్రదర్శన
Tamannaah Bhatia Photoshoot : మతి పోగొట్టేస్తోన్న మిల్కీ బ్యూటీ.. దీపావళి కాంతులన్నీ తమన్నా కళ్లలోనే

Tamannaah Bhatia Photoshoot : టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తమన్నా అందాలకు కుర్రకారు అంతా ఫిదా అవుతుంటారు. ఆన్ స్క్రీన్‌లో తమన్నా అందాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఇక సోషల్ మీడియాలో తమన్నా చేసే ఫోటో షూట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తమన్నా తన వర్కవుట్లు, యోగాసనాలతో చేసే రచ్చ మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో తమన్నా తళుక్కులు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా దీపావళి సందర్భంగా తమన్నా షేర్ చేసిన ఫోటోలు చూసి అంతా షాక్ అవుతున్నారు.

తమన్నాకు ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా దూసుకుపోతోంది. ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తోంది. సౌత్ మీద కాస్త ఇంట్రెస్ట్ తక్కువగా చూపిస్తున్నట్టుగా ఉంది. తమన్నా చివరగా ఎఫ్ 3 సినిమాలో కనిపించింది. అందులోనూ ఆమె వేసిన గెటప్, మీసం పెట్టుకుని కనిపించిన లుక్ మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.

అంతే కాకుండా ఎఫ్ 3 సినిమా షూటింగ్ సమయంలోనూ గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. కాస్త ఎక్స్ ట్రా టైం ఉండమని, కాస్త డేట్స్ అడ్జస్ట్ చేసుకోమని దర్శక నిర్మాతలు అడిగినా తమన్నా అంగీకరించలేదట. దీంతో ఆమె సినిమా ప్రమోషన్స్‌కి కూడా రాలేదు. తమన్నా లేకుండా సినిమా ప్రమోషన్స్ కానిచ్చేశారు.

తమన్నాతో జరిగిన గొడవ మీద అనిల్ రావిపూడి కూడా స్పందించాడు. అదేమీ పెద్ద గొడవ కాదని, అలాంటి చిన్న చిన్న గొడవలు సహజమేనని, భారీ కాస్టింగ్ కావడంతో డేట్స్ అడ్జస్ట్మెంట్లు జరుగుతాయని చెప్పుకొచ్చాడు. ఆమెకు వీలు కాలేదు.. రాలేకపోయిందని అనిల్ రావిపూడి కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.

తమన్నా విలన్‌గానూ మెప్పించింది. నితిన్ మాస్ట్రో సినిమాలో తమన్నా విలన్‌గా నటించింది. హిందీ అంధాదున్ సినిమాలో టబు పోషించిన నెగెటివ్ రోల్‌ను తెలుగులో తమన్నా చేసింది. అయితే ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక రీసెంట్‌గా తమన్నా.. బౌన్సర్‌గా కనిపించింది. బబ్లీ బౌన్సర్ అంటూ ఓటీటీలోకి వచ్చింది. కానీ ఆమెకు అంతగా గుర్తింపును మాత్రం తీసుకురాలేకపోయింది.

తమన్నా తన అందాల ప్రదర్శన మాత్రం ఆపడం లేదు. సోషల్ మీడియాలో తన అందచెందాలను ప్రదర్శించి అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా దీపావళి సెలెబ్రేషన్స్‌లో భాగంగా తమన్నా ఇలా తళుక్కున మెరిసింది. చూపుల్తోనే కుర్రాళ్ల గుండెలను కాల్చేస్తోంది. ప్రస్తుతం తమన్నా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read : Puri Jagannadh Audio Leak : డిస్ట్రిబ్యూటర్లకు వార్నింగ్.. పూరి ఆడియో లీక్

Also Read : ప్రభాస్ కు హీరోలెవరూ విషెష్ చెప్పలేదెందుకబ్బా.. అసూయే కారణమా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News