Sushmita Sen Dating: మరోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్‌.. ఈసారి మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌తో..!

Sushmita Sen dating with Former IPL chairman Lalit Modi. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడ్డారు. ఈసారి ఐపీఎల్‌ చైర్మన్‌ లలిత్‌ కుమార్ మోదీతో డేటింగ్‌ చేస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 14, 2022, 09:58 PM IST
  • మరోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్‌
  • ఈసారి మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌తో
  • ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన
Sushmita Sen Dating: మరోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్‌.. ఈసారి మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌తో..!

Sushmita Sen dating with Former IPL chairman Lalit Modi: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడ్డారు. ఈసారి మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) చైర్మన్‌ లలిత్‌ కుమార్ మోదీతో ప్రేమాయణం నడుపుతున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ మాజీ బాస్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. తామిద్దరం ఇంకా పెళ్లి చేసుకోలేదని, ప్రస్తుతం డేటింగ్‌లోనే ఉన్నామని లలిత్‌ మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబందించిన ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  

సుస్మితా సేన్‌తో కలిసి దిగిన ఫొటోస్ పోస్ట్ చేసిన లలిత్ మోదీ.. ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేశారు. 'కుటుంబాలతో కలిసి తిరుగుతున్న గ్లోబల్ టూర్ ఇది. మాల్దీవుల్స్, సార్డినియాలో షికార్లు కొట్టాక లండన్‌కు తిరిగి వచ్చాను. నా జీవిత భాగస్వామి సుష్మిత సేన్‌తో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చంద్రునిపై తేలుతున్నట్లు ఉంది' అని లలిత్ మోదీ ఓ ట్వీట్ చేశారు. ఆ వెంటనే మరో ట్వీట్ చేస్తూ.. 'జస్ట్ క్లారిటీ కోసం.. ప్రస్తుతానికి మేమిద్దరం డేటింగ్‌లోనే ఉన్నాం. ఇంకా పెళ్లి చేసుకోలేదు. అది కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది' అని పేర్కొన్నారు. 

సుష్మితా సేన్‌ కెరీర్ ఆరంభంలో పాకిస్తాన్ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు. అయితే సుష్మితా‌ బిజీ షెడ్యూల్‌ కారణంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో వీరి ప్రేమ బంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేకప్ అయింది. కొన్నాళ్ల తర్వాత సుష్మితా సేన్‌ ప్రముఖ మోడల్‌ రోహ్మాన్ షాల్‌తో ప్రేమలో పడ్డారు. మూడేళ్ల బంధంకు గతేడాది చివరలో గుడ్ బై చెప్పారు. ఇప్పుడు లలిత్‌ మోదీని లవ్ చేస్తున్నారు. ఈ బంధం అయినా చివరి వరకు ఉండాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.  

Also Read: Janhvi Kapoor Pics: వైట్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ అందాల ట్రీట్.. మొత్తం విప్పి చూపిస్తూ..!   

Also Read: Anupama Parameswaran Pics: శారీలో వయ్యరాలు ఒలకబోసిన అనుపమ పరమేశ్వరన్‌.. ఆ కొంటె చూపుకు ఫాన్స్ ఫిదా!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News