RAM Rapid Action Mission: రిపబ్లిక్ డే కానుకగా ఆడియన్స్‌ ముందుకు ‘రామ్‌’ మూవీ

RAM Rapid Action Mission Release Date: సూర్య అయ్యలసోమయజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన మూవీ రామ్‌  (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్). రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్‌తో అంచనాలను పెంచేసిన రామ్.. ఆడియన్స్‌ను మెప్పిస్తుందో లేదో చూడాలి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 02:04 PM IST
RAM Rapid Action Mission: రిపబ్లిక్ డే కానుకగా ఆడియన్స్‌ ముందుకు ‘రామ్‌’ మూవీ

RAM Rapid Action Mission Release Date: పేట్రియాటిక్ జానర్‌లో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. దేశ భక్తిని తట్టి లేపే చిత్రాలు, మన సైన్యం గురించి గొప్పగా చూపించే సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. ఇక దేశభక్తిని చాటి చెప్పే చిత్రంగా రామ్‌  (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా  ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు.

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ కూడా అందర్నీ అలరంచింది. ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో సినిమా మీద అంచనాలు పెంచింది. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందని మేకర్లు నిర్ణయించారు. జనవరి 26న ఈ మూవీని విడుదల చేయబోతోన్నట్టుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు. 

కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతోన్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందించగా.. ధారన్ సుక్రి సినిమాటోగ్రఫీ వర్క్ చేశారు.

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ
నిర్మాత: దీపికాంజలి వడ్లమాని
బ్యానర్స్: దీపికా ఎంటర్‌టైన్‌మెంట్ & ఓ ఎస్‌ యం విజన్‌ 
సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్
సినిమాటోగ్రఫర్: ధారన్ సుక్రి
PRO: సాయి సతీష్

Also Read: Sania Mirza Divorce News: సానియా మీర్జా విడాకులు తీసుకుందా..? ఇన్‌స్టా పోస్టు అర్థం అదేనా..?

Also Read: Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News