Acharya First Review: ఆచార్య మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఫ్యాన్స్ కు పూనకాలే!

Acharya First Review: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా రివ్యూను చెప్పేశారు ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు. ఆయన ఎలా ఉందన్నారంటే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2022, 04:39 PM IST
Acharya First Review: ఆచార్య మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఫ్యాన్స్ కు పూనకాలే!

Acharya First Review: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. ఈ చిత్రం ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్రంయూనిట్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. నక్సల్ నేపథ్యం, ఆలయాల నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే మాత్రమే కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రంలో  తనికెళ్ల భరణి, సోనూ సూద్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

అయితే ఈ సినిమా రివ్యూను (Acharya First Review) ట్విట్టర్ వేదికగా చెప్పేశారు ప్రముఖ క్రిటిక్, యూఏఈ సెన్సర్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు (Umair Sandhu). ఈ సందర్భంగా సినిమాకు ఏకంగా 4 స్టార్ రేటింగ్ ఇవ్వడమే కాకుండా..చిరంజీవి, రామ్ చరణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆచార్య సినిమా మాస్ ప్రేక్షకులకు పుల్ మసాలా అందించే సినిమా. చిరు, చరణ్ తమ నటనతో ఇరగదీశారని ఆయన అన్నారు. ఈ రివ్యూ పట్ల మెగా ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా మెగా అభిమానులకు పుల్ మీల్స్ ను అందిస్తుందని రివ్యూ చూస్తే అర్థమవుతుంది. 

Also Read: adipurush: ఆదిపురుష్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News