Rajinikanth Birthday: తలైవా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రజనీకాంత్ బర్త్‌ డేకు స్పెషల్ గిఫ్ట్

Rajinikanth Film Festival: తలైవా బర్త్ డేను భారీగా నిర్వహించేందుకు ఫ్యాన్స్‌ ప్లాన్ చేస్తుంటే.. పీవీఆర్ సంస్థ ముందే ట్రీట్ ఇచ్చింది. 'సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బర్త్‌డే స్పెషల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌' పేరుతో రజనీకాంత్ సినిమాలను ప్రదర్శిస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2022, 04:15 PM IST
Rajinikanth Birthday: తలైవా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రజనీకాంత్ బర్త్‌ డేకు స్పెషల్ గిఫ్ట్

Rajinikanth Film Festival: సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు భారీగా నిర్వహించేందుకు అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. రేపు (డిసెంబర్ 12న) సందర్భంగా మన దేశంలో అతిపెద్ద థియేటర్స్ చైన్ పీవీఆర్ సినిమాస్ ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు చెన్నై, కోయంబత్తూరులో ఎంపిక చేసిన థియేటర్లలో ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. 'సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బర్త్‌డే స్పెషల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌' పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. ఏడు రోజులపాటు నిర్వహించే ఫెస్టివల్‌ను నాలుగు సూపర్‌హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. 'బాబా (2002), శివాజీ: ది బాస్ (2007), రోబో 2.0 (2018), దర్బార్ (2020)' సినిమాలను ప్రదర్శిస్తున్నారు. 

పీవీఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌతమ్ దత్తా మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమాలతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారని కొనియాడారు. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఆయన గర్వకారణంగా నిలిచారని అన్నారు. సూపర్ స్టార్ అభిమానులకు ఇది అద్భుతమైన అవకాశమన్నారు.  

సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ప్రతి ఏటా అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కాస్త స్పెషాలిటీ యాడ్ చేయడం విశేషం. ఈ నెల 12న రజినీకాంత్ 72వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. సరికొత్త డిజైన్ చేసిన బాబా మూవీ ప్రీమియర్‌ షోను చెన్నైలోని సత్య థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ షోను చూసేందుకు ప్రొడ్యూసర్ కలైపులి ఎస్‌.థాను, లతా రజనీకాంత్, గీత రచయిత వైరముత్తుతోపాటు సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు. 

స్పెషల్ షో అనంతరం లతా రజనీకాంత్‌ మాట్లాడుతూ.. ఇరవై ఏళ్ల క్రితం చూసిన దానికంటే పది రెట్లు సంతృప్తిని బాబా చిత్రం కలిగించిందని అన్నారు. సినిమా హాల్లో అభిమానుల చప్పట్లతో మూవీని ఎంజాయ్‌ చేస్తున్నారని చెప్పారు. వారికి తమ కుటుంబంపై ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని లతా రజనీకాంత్ అన్నారు.

Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ సినిమాకు టైటిల్ మార్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'గా వస్తున్న పవర్ స్టార్  

Also Read: Mlc Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ టీమ్.. సర్వత్రా ఉత్కంఠ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News