Vettaiyan Movie Review: ‘వేట్టాయ్యన్’ మూవీ రివ్యూ.. రజినీకాంత్ మూవీ మెప్పించిందా..!

Vettaiyan Movie Review: సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ ఇయర్ ‘జైలర్’ మూవీతో  పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత తైలైవా ‘వేట్టాయన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 10, 2024, 10:06 PM IST
Vettaiyan Movie Review: ‘వేట్టాయ్యన్’ మూవీ రివ్యూ.. రజినీకాంత్ మూవీ మెప్పించిందా..!

మూవీ రివ్యూ: వేట్టాయన్ (Vettaiyan)

నటీనటులు: ర‌జినీకాంత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌,రానా ద‌గ్గుబాటి, మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్‌, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషరా విజ‌య‌న్ త‌దిత‌రులు

ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: ఎస్‌.ఆర్‌.క‌దిర్‌

సంగీతం: అనిరుథ్ రవిచందర్

బ్యాన‌ర్‌:  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌

నిర్మాత: సుభాస్క‌ర‌న్‌

రచన, దర్శకత్వం: టి.జె.జ్ఞాన‌వేల్‌,

విడుదల తేది: 10-10-2024

సూపర్ స్టార్ ప్రస్తుతం తన ఏజ్ తగ్గ పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ కోవలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వేట్టాయన్ - ది హంటర్’ మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. మరి ఈ సినిమాతో రజినీకాంత్ ప్రేక్షకులను మెప్పించాడా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

ఎస్పీ అథియన్ (రజినీకాంత్ ) డ్యూటీ అంటే ప్రాణం. అంతేకాదు నేరస్తుల పాలిట యముడు. మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ ను ఎలాంటి బెరకు లేకుండా వేటాడుంటాడు. ఈ క్రమంలో కన్యాకుమారిలో లేడీ టీచర్ ను రేప్ చేసి హత్య చేస్తారు. ఈ క్రమంలో ఆ కేసు ఎస్పీ అథియన్ దగ్గరకు వస్తుంది. ఈ క్రమంలో మాన భంగం, హత్య చేసిన వ్యక్తిని ఎన్ కౌంటర్ చేస్తారు. తీరా అది ఫేక్ అని తెలుస్తుంది. అంతేకాదు ఆ హత్య వెనుక ఓ మోటివ్ ఉంటుందనేది ఎస్పీకి తెలుస్తుంది. ఈ క్రమంలో టీచర్ హత్య వెనక ఎవరున్నారు. ఆ హత్యకు అసల కారకులను ఎస్పీ అథియన్ చట్టం ముందు శిక్ష పడేలా చేసేడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.
ఈ క్రమంలో మానవ హక్కులకు చైర్మన్ స‌త్య‌దేవ్ (అమితాబ్ బ‌చ్చ‌న్‌)కు ఎస్పీ అథియన్ కు సంబంధం ఏమిటనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు టీజే జ్ఞానవేల్ రాజా.. సూర్యతో తెరకెక్కిన ‘జైభీమ్’ సినిమాతో దర్శకుడిగా తన విజన్ ఏంటో చూపించాడు. ఇపుడు అదే బడుగు, బలహీన వర్గాలు, పేదలకు బేస్ చేసుకొని దానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్ వాడుకొని ‘వేట్టాయన్’  సినిమాను తెరకెక్కించాడు. మొత్తంగా ఈ వయసులో తలైవాకు తగ్గ అద్భుతమైన స్టోరీతో ఈ సినిమాను అంతే అద్భుతంగా తెరకెక్కించాడు జ్ఞానవేల్ రాజా. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వాళ్లకు ప్రస్తుతం విద్య అనేది అందని ద్రాక్షలా మారింది. అంతేకాదు సగటు పేద, మధ్య తరగతి వాళ్లు తమ సంపాదనలో 60 శాతం చదువుకే కేటాయిస్తురనే విషయాన్నిఈ సినిమాలో ప్రస్తావించారు.

అంతేకాదు ప్రస్తుతం పోలీసులు రేప్, ఇతరత్రా సంఘటనలు జరిగినపుడు ప్రజల నుంచి వ్యతిరేకత  రావడంతో  నేరస్థులను ఎలాంటి విచారణ జరపకుండానే  పోలీసులు  ఎన్ కౌంటర్ పేరుతో చంపేస్తున్నారు. అందులో ఎన్ కౌంటర్ లో చంపబడే వాళ్లందరు పెద్దింటి వాళ్లు ఎవరు ఉండటం లేదు. బడుగు, బలహీన వర్గాలు, పేదలు, కనీసం లాయర్ ఫీజు కూడా ఇచ్చుకోని వాళ్లే పోలీసుల ఎన్ కౌంటర్ లకు ఎక్కువగా బలైపోతున్నారనే విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. మొత్తంగా పోలీసులు అంటే హంటర్ కాదు.. ప్రొటెక్టర్ అని ఈ సినిమాలో చూపించాడు.  

ఈ సినిమాలో ఓ మహిళను రేప్, చేసి హత్య చేస్తారు. ఈ క్రమంలో ఆమెపై అత్యాచారం చేసిన అక్యూ్ ను ఎన్ కౌంటర్ లో చంపడం.. కానీ అదంత ఓ పథకంలో భాగంగా.. ఓ అమాయకుడిని ఇరికించినట్టు హీరో అథియన్ తెలుసుకోవడం.. దీని వెనక కార్పోరేట్ విద్య వ్యవస్థను శాసించే  నట రాజ్ (రానా దగ్గుబాటి) ఉంటాడని అథియన్  తెలుసుకుంటాడు. అతన్ని చట్టానికి పట్టించడానికి హీరో ఎలాంటి పథకాలను రచించాడనేది ఈ సినిమాలో  ఆసక్తికరంగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లోనే హీరో .. తాను ఓ అమాయకుడిని ఎన్ కౌంటర్ చేసిన విషయాన్ని తెలుసుకోవడంతో సెకాండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు. ఈ సినిమా మలయాళంలో వచ్చిన ‘జనగణమన’ సినిమా చూసిన వాళ్లకు ఈ సినిమాలో నెక్ట్స్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది.  కానీ ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా తనదైన శైలిలో ఎక్కడా అతి లేకుండా పకడ్బందీగా తెరకెక్కించాడు. ముఖ్యంగా మానవ హక్కుల సంఘం చైర్మన్  సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) పాత్ర కోసం ఆయన్ని ఎంచుకోవడం పర్ఫెక్ట్ ఛాయిస్. ఇంకోవైపు పాట్రిక్ పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్ తన నటనతో మెప్పించాడు. రానా దగ్గుబాటి కార్పోరేట్ విద్య వ్యవస్థను శాసించే నటరాజ్ పాత్ర కోసం అతన్ని వాడుకోవడం అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఈ సినిమాకు అనిరుథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

నటీనటుల విషయానికొస్తే..

రజనీకాంత్ జైలర్ తర్వాత ఎస్పీ అథియన్ గా చక్కగా ఒదిగిపోయాడు. మరోసారి హీరోగా తన స్వాగ్ చూపించి మాస్ ప్రేక్షకులను మెప్పించాడు. అటు అమితాబ్ బచ్చన్ సత్యదేవ్ పాత్రలో తన తప్పించి మరో నటుడిని అందులో ఊహించుకోలేము. అంతగా ఆ పాత్రలో ఒదిగాపోయారు. ఇక ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో మరో హీరోగా, కమెడియన్ గా రెండు పాత్రలను మెప్పించాడు. కార్పోరేట్ విద్యా వ్యవస్థను శాసించే నటరాజ్ పాత్రలో రానా దగ్గుబాటి నటన ఆకట్టుకుంటుంది. టీచర్ పాత్రలో నటించిన నటి.. హీరో భార్య పాత్రలో మంజు వారియర్ తమ పరిధి మేరకు మెప్పించారు.

ప్లస్ పాయింట్స్

రజినీకాంత్ స్వాగ్, బిగ్ బీ నటన

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

కథనం, ఇంటర్వెట్ బ్యాంగ్

మైనస్ పాయింట్స్

సింగిల్ పాయింట్ చుట్టే తిరిగే  కథ

సినిమా నిడివి

పంచ్ లైన్.. ‘వేట్టాయన్’..మెప్పించే  రజినీకాంత్ స్వాగ్

రేటింగ్..3/5

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Trending News