Krishna Last Movie: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమ ఏమిటో తెలుసా?

Super Star Krishna Last Movie: తన కెరీర్లో  సుమారు 345 కు పైగా సినిమాల్లో కృష్ణ నటించారు కానీ సూపర్ స్టార్ కృష్ణ చివరి సినిమా ఏమిటి అనే విషయం మీద చాలా మందికి అనుమానం ఉంటుంది. ఆ సినిమా ఏమిటో చూద్దాం పదండి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 15, 2022, 07:26 AM IST
Krishna Last Movie: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమ ఏమిటో తెలుసా?

Super Star Krishna Last Movie: సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 4.10 నిమిషాలకు ఆయనకు కన్ను మూసినట్లుగా కాంటినెంటల్ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. 1942 మే 31న జన్మించిన కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. 1964 ముందు చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 65లో సినిమా హీరోగా మారే అవకాశం దక్కింది. తేనె మనసులు సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత అనేక ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.

తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమాగా గూడచారి 116 నిలువగా తెలుగు తొలి కౌబాయ్ సినిమాగా మోసగాళ్లకు మోసగాడు నిలిచింది. ఇక తొలి ఫుల్ స్కోప్ సినిమాగా అల్లూరి సీతారామరాజు తొలి 70 ఎంఎం సినిమాగా సింహాసనం నిలిచాయి. సుమారు 345 కు పైగా సినిమాల్లో కృష్ణ నటించారు. 1970లో పద్మాలయ నిర్మాణ సంస్థ ప్రారంభించి అత్యంత కాలంలోనే సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ చివరి సినిమా ఏమిటి అనే విషయం మీద చాలా మందికి అనుమానం ఉంటుంది.

అయితే చివరిగా ఆయన నటించిన సినిమా పేరు శ్రీ శ్రీ ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, నరేష్ కలిసి నటించారు. ముప్పలనేని శివ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాకి సాయి దీప్, బాలురెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా జూన్ మూడో తేదీ 2016 లో విడుదలైంది. ఇక అంతకు ముందు ఆయన సుకుమారుడు అనే సినిమాలో నటించారు ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఏ సినిమాలో నిషా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. జీ అశోక్ డైరెక్షన్లో ఈ సినిమాని వేణుగోపాల్ నిర్మించారు. క్రిష్ణ కెరియర్ లో విజయనిర్మల హీరోయిన్ గా 48 సినిమాల్లో నటిస్తే జయప్రద హీరోయిన్ గా 407 సినిమాల్లో శ్రీదేవి హీరోయిన్ గా 30 సినిమాల్లో నటించారు.

Also Read: Krishna Latest Health Bulletin: మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. మా చేతుల్లో ఏమీ లేదు.. డాక్టర్స్ కీలక ప్రకటన!

Also Read: Krishna Passed Away: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News