Gadar 2 Collections: రూ. 150 కోట్లకు చేరువలో 'గదర్ 2'.. మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే?

Gadar 2 Collections: సన్నిడియోల్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'గదర్ 2'. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే...  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2023, 03:11 PM IST
Gadar 2 Collections: రూ. 150 కోట్లకు చేరువలో 'గదర్ 2'.. మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే?

Gadar 2 Box Office Collection Day 3: సన్నిడియోల్(Sunny Deol), అమీషా పటేల్ లీడ్ రోల్స్ లో నటించిన 'గదర్ 2' (Gadar 2) సినిమా బాక్సాఫీస్ దుమ్మురేపుతుంది. ఈ మూవీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ మూవీ రిలీజ్ కు ముందే టీజర్లు, ట్రైలర్ తో భారీ హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్, ఆక్యుపెన్సీ నమోదైంది. ఆగస్టు 11న మూవీ రిలీజైన తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన ఈ మూవీని వరల్డ్ వైడ్ గా 4వేల స్క్రీన్స్ లో విడుదల చేశారు. ఇండియాలోనే 3500 స్క్రీన్లలో రిలీజ్ చేయడం విశేషం. 

గదర్ 2 సినిమా అందరి అంచనాలను మించి వసూళ్లు రాబడుతోంది. దాంతో ఈ మూవీ తొలి రోజే 40.10 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. రెండో రోజు రూ.43 కోట్లు వసూలు చేయగా.. మూడు రోజు దాదాపు రూ.48 కోట్లు వరకు కలెక్షన్ల సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో గదర్ 2 బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు దాదాపు రూ.131.10 కోట్లు వసూలు చేసింది. శనివారం అన్ని హిందీ షోలలో సన్నీ డియోల్ చిత్రం మొత్తం 65.40 శాతం ఆక్యుపెన్సీని సాధించినట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడం, మరో రెండు రోజుల్లో ఇండిపెండెన్స్‌ డే కూడా రానుండటంతో ఈ మూవీ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని చాలా ఏరియాల్లో స్వయంగా నిర్మాతలే రిలీజ్ చేయడం గమనార్హం. 

2001లో వచ్చిన 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' చిత్రానికి రీమేక్ గా గదర్ 2 తెరకెక్కింది. 1947లో పాకిస్థాన్ విభజన కథా నేపథ్యంగా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాకు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. అప్పట్లో 13 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ 130 కోట్లకు పైగా వసూలు చేసింది. మళ్లీ 22 ఏళ్ల తర్వాత వచ్చిన గదర్ 2కు కూడా అనిల్ శర్మ డైరెక్షన్ చేయడం విశేషం. ఈ రీమేక్ లో సన్నీ డియోల్, అమీషా పటేల్ మరియు ఉత్కర్ష్ శర్మ తమ పాత్రలను తిరిగి పోషించారు. శక్తిమాన్ తల్వార్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించారు. 

Also Read: Rajinikanth:  బద్రీనాథుని సేవలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, వీడియో వైరల్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News