Sundeep Kishan Regina Cassandra : రెజీనాతో రిలేషన్ ఇదే.. ముంబై ఇంట్లో అంటూ నోరు విప్పిన సందీప్ కిషన్

Sundeep Kishan Regina Cassandra Relation సందీప్ కిషన్ తాజాగా తన మైఖెల్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రెజినాతో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడు. తామిద్దరం ఎంతో మంచి స్నేహితులమని అన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 06:07 PM IST
  • మైఖెల్ మూవీతో సందీప్ కిషన్
  • రెజినాతో రిలేషన్ ఇదేనన్న హీరో
  • ముంబై ఇంట్లో కూడా ఉంటుందట
Sundeep Kishan Regina Cassandra : రెజీనాతో రిలేషన్ ఇదే.. ముంబై ఇంట్లో అంటూ నోరు విప్పిన సందీప్ కిషన్

Sundeep Kishan Regina Cassandra Relation సందీప్ కిషన్, రెజినా కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. రెజినా కెరీర్, సందీప్ కెరీర్ దాదాపు ఒకే సమయంలో ప్రారంభమైంది. అలా కెరీర్ ప్రారంభంలో కలిసి నాలుగు సినిమాలు చేస్తే ఏర్పడే క్లోజ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే రెజినా, సందీప్ కిషన్‌ల రిలేషన్ మీద ఎక్కువగా రూమర్లు వస్తుంటాయి.

రెజినా బర్త్ డే సందర్భంగా సందీప్ కిషన్ ఓ రొమాంటిక్ ఫోటోను షేర్ చేశాడు. ఫ్రెండ్లీగానే లవ్యూ చెబుతూ బర్త్ డే విషెస్ చెప్పాడు. దీంతో జనాలు ఈ ఇద్దరి రిలేషన్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక కోలీవుడ్ మీడియాలోనూ ఈ ఇద్దరూ హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా సందీప్ కిషన్ మైఖెల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమ రిలేషన్ మీద స్పందించాడు.

మాది పన్నేండేళ్ల బంధం. కలిసి నాలుగు సినిమాలు చేశాం.. అలాంటి ఫోటోలు మేం చాలానే దిగాం.. అందులో ఏముంది..అయినా ఆ వార్తలు చెన్నై మీడియా రాసింది.. వారికి కొత్త. కానీ తెలుగు మీడియా అలా రాయదు. మా గురించి రాసి రాసి వాళ్లకి కూడా బోర్ కొట్టింది.. మా గురించి వాళ్లకి తెలుసు.. నాకు ఆమె మంచి ఫ్రెండ్.. ముంబైలో ఆమె షూటింగ్ ఆలస్యమైనా, ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చినా.. అక్కడ మా సిస్టర్ ఇంట్లోనే ఉంటుంది.. అంత క్లోజ్‌నెస్ మా మధ్యలో ఉంది.. అంటూ సందీప్ కిషన్ తమ రిలేషన్ మీద క్లారిటీ ఇచ్చాడు.

తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని సందీప్ కిషన్ ఈ రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేశాడు. సందీప్ కిషన్ మైఖెల్ సినిమాతో హిట్ కొట్టాలని ప్రయత్నించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గానే నిలిచేట్టు కనిపిస్తోంది. మౌత్ టాక్, రివ్యూలు కూడా అంత గొప్పగా లేకపోవడంతో కలెక్షన్లు ఎక్కువగా రావడం లేదని టాక్.

Also Read:  Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?

Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News