Sulthan movie review: సుల్తాన్ మూవీ రివ్యూ, రేటింగ్

Sulthan movie review in Telugu: ఖైదీతో సూపర్ హిట్ కొట్టిన కార్తి ఆ తర్వాత మళ్లీ అదే ప్రొడక్షన్ హౌజ్ తెరకెక్కించిన సుల్తాన్ మూవీతో మరోసారి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. మరి సుల్తాన్‌గా కార్తి ఆకట్టుకున్నాడా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. 

Last Updated : Apr 2, 2021, 07:57 PM IST
  • సుల్తాన్ మూవీతో మరోసారి ఆడియెన్స్ ముందుకొచ్చిన Karthi.
  • సుల్తాన్ మూవీతో తమిళ సినీపరిశ్రమకు పరిచయం అవుతున్న Rashmika Mandanna.
  • హీరోతో సోదరభావంతో మెదిలే 100 మంది రౌడీలు కాన్సెప్టుతో ఓ ప్రయోగం చేసిన దర్శకుడు బక్కియరాజ్ కన్నన్ సక్సెస్ అయ్యాడా ? సుల్తాన్ మూవీ ఎలా ఉందనే వివరాలు ఈ రివ్యూలో చూద్దాం.
Sulthan movie review: సుల్తాన్ మూవీ రివ్యూ, రేటింగ్

నటీనటులు: కార్తీ, ర‌ష్మిక, యోగిబాబు, నెపోలియ‌న్‌, లాల్‌, హరీష్, నవాబ్ షా
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణ‌న్‌
నిర్మాత‌లు: య‌స్‌.ఆర్‌. ప్ర‌కాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్ర‌భు
బ్యాన‌ర్‌: డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌త్య‌న్ సూర్య‌న్‌
మ్యూజిక్‌: వివేక్ మెర్విన్‌
ఎడిటింగ్‌: రూబెన్‌
రన్‌టైమ్: 2 గంటల 38 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: ఏప్రిల్ 2, 2021
Sulthan movie review in Telugu: ఖైదీతో సూపర్ హిట్ కొట్టిన కార్తి ఆ తర్వాత మళ్లీ అదే ప్రొడక్షన్ హౌజ్ తెరకెక్కించిన సుల్తాన్ మూవీతో మరోసారి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. మరి సుల్తాన్‌గా కార్తి ఆకట్టుకున్నాడా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ
సేతుపతి (Napolean) వైజాగ్‌లో పెద్ద రౌడీ. అతడి వద్ద ప్రాణాలిచ్చే వంద మంది రౌడీలుంటారు. సేతుపతికి ఒకే ఒక్క కొడుకు సుల్తాన్ (Karthi). చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన సుల్తాన్‌ను ఈ వంద మంది రౌడీలు ప్రేమగా పెంచుతారు. ఓ సమస్యను పరిష్కరించడం కోసం అమరావతి దగ్గర్లోని వెలగపూడి గ్రామానికి వెళ్తాడు సుల్తాన్. అక్కడే రుక్మిణి (Rashmika Mandanna)ని చూసిన సుల్తాన్ ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఆ గ్రామానికి ఓ సమస్య ఉంటుంది. ఆ సమస్యను తీరుస్తానని సుల్తాన్ తండ్రి గతంలోనే మాటిచ్చి ఉంటాడు.

తండ్రి మాట నెరవేర్చేందుకు సుల్తాన్ ఆ గ్రామంలోనే ఉండిపోతాడు. ఈ క్రమంలో తను అన్నలుగా భావించే వంద మంది రౌడీలకు, సుల్తాన్‌కు మధ్య అభిప్రాయబేధాలొస్తాయి. అసలు రౌడీలకు, సుల్తాన్‌కు మధ్య గ్యాప్ ఎందుకొస్తుంది.. ఇంతకీ ఊరికి వచ్చిన సమస్యేంటి అనేది బ్యాలెన్స్ కథ.

Also read : Actor Karthi లేటెస్ట్ మూవీ Sultan తెలుగు హక్కులు ఎంతకీ డీల్ కుదిరిందో తెలుసా

నటీనటుల పనితీరు
సుల్తాన్‌గా కార్తి మరోసారి బాగా యాక్ట్ చేశాడు. క్యారెక్టర్‌లో అతడు ఒదిగిపోయే విధానం బాగుంటుంది. తండ్రి మాటను నిలబెట్టే కొడుకుగా.. వంద మంది రౌడీలను కాపాడుకునే లీడర్‌గా… ప్రేయసి కష్టాన్ని తీర్చే ప్రేమికుడిగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్‌లో బాగా నటించాడు. ఫస్ట్ టైమ్ పల్లెటూరి పిల్ల పాత్ర పోషించిన రష్మిక.. వీలైనంతవరకు తన పాత్రను పండించే ప్రయత్నం చేసింది. ఆమె యాక్టింగ్ టాలెంట్ పెద్దగా కనిపించనప్పటికీ.. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె లుక్స్ మాత్రం బాగున్నాయి. మిగతా నటీనటులంతా తమ పాత్రల మేరకు మెప్పించారు.

ఇక వందమంది రౌడీలుగా వంద మంది ఆర్టిస్టులు.. సినిమాలో ఎక్కడా సింగిల్ ఫ్రేమ్‌లో కనిపించరు. పైగా అందులో ఓ నలుగురికి మాత్రమే నటించే అవకాశం కలిగింది. యోగిబాబును అటు విలన్ గ్యాంగ్‌లో చూపించలేక, ఇటు హీరో పక్కన కమెడియన్‌గా సెట్ చేయలేక దర్శకుడు పడిన ఇబ్బంది స్పష్టంగా కనిపించింది.

టెక్నీషియన్స్ పనితీరు:
టెక్నీషియన్స్‌లో హీరో ఎవరంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్‌కే ఆ గౌరవం ఇవ్వాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాను బ్రహ్మాండంగా ప్రజెంట్ చేశాడు ఈ డీవోపీ. యువన్ శంకర్ రాజా ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ, వివేక్-మెర్విన్ ఇచ్చిన సాంగ్ ట్యూన్స్ మాత్రం బాగా లేవు. ఎప్పట్లానే డ్రీమ్ వారియర్స్ బ్యానర్… గ్రాండియర్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో తన ఇమేజ్‌ను నిలబెట్టుకుంది.

Also read: Wild dog movie review: వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ, రేటింగ్

దర్శకుడిగా బక్కియరాజ్ కణ్నన్‌కు ఫుల్ మార్కులు వేయలేం. అతడు సెలక్ట్ చేసుకోవడమే రొటీన్ కథను సెలక్ట్ చేసుకున్నాడు. కాకపోతే దానికి డిఫరెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడంలో అతడు సక్సెస్ అయ్యాడు. యాక్షన్ సీన్స్‌లో, కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో అతడి టేకింగ్ మెప్పిస్తుంది. కాకపోతే కుటుంబ బంధాల్లేని ఈ సినిమాలో డ్రామా ఎక్కువగా పెట్టేశాడు. రెండున్నర గంటలు సినిమా తీయాలని కంకణం కట్టుకొని తీసినట్టున్నాడు డైరక్టర్. లేదంటే ఈ మూవీని 2 గంటల్లోనే నీట్‌గా ముగించొచ్చు.

ఒక హీరో.. వంద మంది రౌడీలు.. ఆ రౌడీలతో హీరో ఫైట్ చేయడం రొటీన్. అదే వంద మంది రౌడీల్ని తన అన్నలుగా భావించి వాళ్లతోనే కలిసి ఉండడం వెరైటీ. పాయింట్ చెప్పుకోవడానికి చాలా థ్రిల్లింగ్‌గా ఉంది కదా. కానీ దర్శకుడు మాత్రం ఆ థ్రిల్‌ను రెండున్నర గంటల సేపు కంటిన్యూ చేయలేకపోయాడు. సినిమా ఒక దశకు చేరేసరికి రౌడీల స్థానంలో రెగ్యులర్‌గా కనిపించే కుటుంబ సభ్యులు మామ, అక్క, వదిన, అన్న లాంటి పాత్రల్ని పెట్టినా సరిపోయేదనిపిస్తుంది.

ఊరికి సమస్య వస్తుంది. ఆ సమస్యను హీరో తీరుస్తాడు. ఈమధ్య కొంతమంది తెలుగు హీరోలు చేసినట్టుగానే ఊరిలో వ్యవసాయం కూడా చేస్తాడు. అదే ఊరిలో ఓ పిల్లను చూసి పెళ్లి చేసుకుంటాడు. పరమ రొటీన్‌గా ఉన్న ఈ స్టోరీలైన్‌కు “వంద మంది రౌడీలు” అనే యాంగిల్‌ను యాడ్ చేశాడు దర్శకుడు. వాళ్ల చుట్టూ కథ నడపడంలో, వాళ్లను ఎలివేట్ చేయడంలో బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే సెకెండాఫ్‌కు వచ్చేసరికి రౌడీలు-హీరోల మధ్య ఎమోషన్‌ను సగటు ఫ్యామిలీ సినిమాలా చూపించి నిరాశపరిచాడు.

Also read: Happy Birthday Ajay Devgn: పుట్టినరోజు సందర్భంగా అజయ్ దేవగణ్‌కు ఆర్ఆర్ఆర్ సర్‌ప్రైజ్

ఇక క్లైమాక్స్‌కు వచ్చేసరికి దాదాపు ప్రతి ప్రేక్షకుడు ఊహించినట్టుగానే ముగింపు ఉంది. అందులో కొత్తదనం చూపించడానికి లేదంటే ట్విస్టులు ఇవ్వడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు డైరెక్టర్. మనకెందుకొచ్చిన రిస్క్ అన్నట్టు రాసుకున్నాడు. సుల్తాన్ పాత్రను పరిచయం చేయడం.. వంద మంది రౌడీల్ని చూపించడం.. ఊరికి ఓ సమస్యను సృష్టించడం.. అందులో మరో విలన్‌ను పెట్టడం లాంటి ఎలిమెంట్స్‌తో మొదటి భాగాన్ని బాగానే కూర్చాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్‌కు వచ్చేసరికి కార్తిని ఫుల్‌లెంగ్త్ హీరోగా ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. అయితే రెండో అర్థభాగం మొదలయ్యేసరికి రొటీన్ సినిమాను తలపించాడు.
ఉన్నంతలో ఈ సినిమాను ఆదుకున్న ఏకైక నటుడు కార్తి (Actor Karthi). అతడి ప్రజెన్స్, యాక్టింగ్, ఫైట్స్ అన్నీ బాగున్నాయి. పల్లెటూరి పిల్లగా రష్మిక (Actress Rashmika Mandanna) ఓకే అనిపించుకుంది. ఆమె పాత్రను డైరక్టర్ సరిగ్గా రాసుకోలేదు. రష్మిక మందనకు తమిళంలో ఇదే మొదటి సినిమా. 

ఓవరాల్‌గా సుల్తాన్ సినిమా అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, మార్కెట్ సీన్‌తో పాటు మరికొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి.

రేటింగ్ : 2.5/5

జీ సినిమాలు సౌజన్యంతో...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News