Hunt Telugu Movie Review మనం మలయాళం సినిమాలు చూస్తూ ఇలాంటివి మన వద్ద ఎందుకు తీయరని అనుకుంటూ ఉంటాం. అయితే అక్కడి కథ, కథనాలు ఎంత నేచురల్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. మన వాళ్లు ఎక్కువగా అక్కడి సినిమాలను రీమేక్ చేస్తుంటారు. ఇలాంటి క్రమంలో సుధీర్ బాబు హంట్ కూడా రీమేక్ చేసి తీశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ముంబై పొలీస్ సినిమాను తెలుగులో హంట్‌గా తీశారు.
కథ
ముగ్గురు పోలీస్ ఆఫీసర్ల చుట్టూ హంట్ కథ తిరుగుతుంది. ఐపీఎస్ ఆఫీసర్లైన మోహన్ (శ్రీకాంత), అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు), ఆర్యన్ దేవ్ (భరత్)ల చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది. ఆర్యన్ దేవ్‌ను ఎవరో హత్య చేస్తారు. ఆ కేసును అర్జున్ ప్రసాద్ ఎట్టకేలకు చేదిస్తాడు. అయితే చివరి నిమిషంలో అర్జున్‌కు యాక్సిడెంట్ అవ్వడంతో గతాన్ని మర్చిపోతాడు. కేసు తేలకుండా అలా మిగిలిపోతుంది. మళ్లీ అర్జున్‌కు గతం గుర్తుకు వస్తుందా? ఆ కేసును పరిష్కరిస్తాడా? అసలు ఆర్యన్‌ను చంపింది ఎవరు? చివరకు అర్జున్ ఏం చేశాడు? అనేది కథ.
నటీనటులు
సుధీర్ బాబు అసలు ఈ కథను ఒప్పుకోవడమే గ్రేట్. అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు మెప్పిస్తాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో సుధీర్ బాబు నటన అందరినీ మెప్పిస్తుంది. శ్రీకాంత్‌కు కాస్త సీరియస్ రోల్ దక్కింది. భరత్ చాలా రోజుల తరువాత ఇలా తెరపై కనిపించాడు. ఏసీపీ ఆర్యన్ దేవ్ పాత్రలో అందరినీ ఆకట్టుకుంటాయి. మైమ్ గోపీ, కబీర్ సింగ్ దుల్హన్ వంటి వారు చక్కగా నటించారు. మంజుల, సంజయ్ వంటి వారు కూడా తమ పరిధి మేరకు మెప్పించారు.
విశ్లేషణ
మలయాళంలో ముంబై పోలీస్ సినిమాను చూసిన వారికి ఈ హంట్ పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు. అయితే ఈ పాయింట్‌తో సినిమా తీసేందుకు ముందుకు వచ్చిన సుధీర్ బాబు ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవచ్చు. ఇలాంటి కథను మన వాళ్లు ఓకే చేయడం అంత ఈజీ ఏమీ కాదు. కానీ సుధీర్ బాబు మాత్రం తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన పాత్రను ఎంచుకున్నాడు.
ఇక మెయిన్ పాయింట్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ కథనం విషయంలో మాత్రం చాలానే మార్పులు చేర్పులు చేసినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ముందే తెలిసిన వారికి ఈ సినిమా కాస్త సహన పరీక్షలా ఉంటుంది. స్లోగా సినిమా సాగుతుంటుంది. ఎంత సేపు కథ అక్కడక్కడే తిరిగినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ విషయంలో చిన్న పాటి ట్విస్ట్ ఒరిజనల్ ఉండగా.. తెలుగులో దాన్ని ఎడిట్ చేసినట్టుగా కనిపిస్తోంది.
హంట్ విషయంలో ప్రథమార్థం కాస్త స్లోగా అనిపిస్తే.. ద్వితీయార్థంలోనే అసలు కథ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సుధీర్ బాబు మెప్పిస్తాడు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంటుంది. విజువల్స్, ఎడిటింగ్, మాటలు అన్నీ కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు భవ్య క్రియేషన్స్‌కు తగ్గట్టుగా ఉన్నాయి.
రేటింగ్ 2.75
బాటమ్ లైన్ : హంట్.. సుధీర్ బాబులోని కొత్త యాంగిల్
Also Read: Naatu Naatu oscar Nominations : టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం.. నామినేట్ అయిన నాటు నాటు
Also Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి, ముగ్గురికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి