SS Rajamouli: రాజమౌళి వల్ల ఆగిపోయిన నిహారిక - అఖిల్ ప్రాజెక్ట్.. షాపింగ్ విషయం బయటపెట్టిన నటి

Akhil Akkineni Upcoming Movies: షార్ట్ ఫిలిమ్స్ తో పేరు తెచ్చుకున్న మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల.. తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి రెండు మూడు.. సినిమాల్లో నటించింది. అయితే చాలాకాలం ముందు నిహారిక.. అక్కినేని అఖిల్ తో ఒక షార్ట్ ఫిలిం లో నటించిందట. కానీ ఆ ప్రాజెక్ట్ రాజమౌళి వల్ల రిలీజ్ కాలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని నిహారిక ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇందుకు.. సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 7, 2024, 11:58 AM IST
SS Rajamouli: రాజమౌళి వల్ల ఆగిపోయిన నిహారిక - అఖిల్ ప్రాజెక్ట్.. షాపింగ్ విషయం బయటపెట్టిన నటి

Akhil-Niharika: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరియర్ ని మొదలుపెట్టింది. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా వచ్చిన..ఒక మనసు.. అనే సినిమాతో హీరోయిన్ గా మారి.. రెండు మూడు సినిమాల్లో కూడా నటించింది. కానీ నటిగా మంచి పేరు మాత్రం తెచ్చుకోలేకపోయింది. దీంతో కొంతకాలం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది.. ఈ భామ. 

తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ లో మాట్లాడుతూ.. నిహారిక కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. చాలా కాలం ముందు నిహారిక ఒక షార్ట్ ఫిలిం లో నటించిందట. అందులో అక్కినేని అఖిల్ హీరోగా నటించగా.. ఎస్ ఎస్ రాజమౌళి కొడుకు ఎస్ ఎస్ కార్తికేయ దర్శకత్వం వహించారట. కానీ రాజమౌళి కారణంగా ఆ షార్ట్ ఫిలిం వెలుగు చూడలేదు అని ఆమె బయట పెట్టింది. 

"అఖిల్ తో నేను ఒక షార్ట్ ఫిలిం లో నటించాను. దానికి కార్తికేయ ఎస్ఎస్ దర్శకత్వం వహించారు. రాజమౌళి సార్, నాగార్జున సార్, నాగబాబు కూతురు ఓకే ప్రాజెక్టులో. అది ఓకే ఒకే గా వచ్చింది. కానీ ఈ షార్ట్ ఫిలిం మొత్తం చూశాక రాజమౌళి ఇది రిలీజ్ చేయకపోతే బెటర్ ఏమో అని అన్నారు" అంటూ నవ్వేసింది నిహారిక. అందుకే ఆ షార్ట్ ఫిలిం రిలీజ్ అవ్వలేదు అని చెప్పుకొచ్చింది. 

అంతేకాకుండా నిహారిక విశ్వక్ సేన్ తో కూడా ఒక షార్ట్ ఫిలింలో నటించాల్సిందట. "అది ఒక కళాఖండం. మేము కలిసి షార్ట్ ఫిలింలో నటించాలి కానీ కేవలం ఒక సాంగ్ మాత్రమే కలిసి చేసాము" అని క్లారిటీ ఇచ్చింది నిహారిక. విశ్వక్ సేన్ కాలేజి లో నిహారిక సీనియర్ అని పలు సందర్భాల్లో విశ్వక్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. 

మరోవైపు అఖిల్, నిహారిక కలిసి నటించిన షార్ట్ ఫిలిం ఎలా ఉన్నా.. రిలీజ్ అయితే బాగుంటుంది అని అభిమానులు అంటున్నారు. ఇక ఏజెంట్ సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్న అఖిల్ మళ్లీ ఇప్పుడు సినిమాలతో బిజీ కాబోతున్నారు. నిహారిక కూడా సినిమాల్లో నటిస్తూనే కొన్ని సినిమాలను నిర్మించడానికి కూడా రెడీ అవుతోంది.

Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News