Valentines Week Re-releases: వాలైంటెన్స్ డే స్పెషల్.. రీ-రిలీజ్‌కి సిద్ధమైన 4 క్లాసిక్స్

Valentines Week Special Movies: ఫిబ్రవరి నెల వచ్చింది అంటేనే ప్రేమికులకు పండగ .ఇందుకు కారణం ఫిబ్రవరి 14 అదేనండి.. ప్రేమికుల దినోత్సవం. కాగా ఈసారి ప్రేమికుల పండుగకు.. క్లాసిక్ సినిమాలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2024, 05:45 PM IST
Valentines Week Re-releases: వాలైంటెన్స్ డే స్పెషల్.. రీ-రిలీజ్‌కి సిద్ధమైన 4 క్లాసిక్స్

Sita Ramam Re-release: ఫిబ్రవరి 14 అంటేనే.. ఎందరికో అది ఓ స్పెషల్ ఎమోషన్ తో కూడుకున్న రోజు. వేలంటైన్స్ డే గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ రోజు ఎందరో తమ  ప్రేమను ప్రేమించిన వ్యక్తికి తెలియపరుస్తారు. ప్రేమలో ఉన్న వారే కాదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ..పెళ్లి చేసుకున్నాక ప్రేమించే వారు.. ఈ రోజును ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజంతా కేవలం పార్కులకు.. రెస్టారెంట్లకు కాక చాలామంది సినిమాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. మంచి రొమాంటిక్ సినిమాలను చూసి ఎంజాయ్ చేయడానికి ఎన్నో జంటలు.. థియేటర్లలో తమకు సెట్ అయ్యే సినిమా కోసం వెతుకుతారు.

అలాంటి వారి కోసం వాలెంటైన్స్ డే సందర్భంగా ఎన్నో క్లాసిక్ చిత్రాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా బాలీవుడ్ గాడ్ ఆఫ్ రొమాన్స్.. షారుక్ ఖాన్ నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే. 1995లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ లవర్స్ ఛాయిస్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా ఈ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. దీంతో పాటుగా దిల్ తో పాగల్ హై ,మొహబ్బతే లాంటి క్లాసిక్స్  కూడా విడుదల కాబోతున్నాయి.

ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే 2008లో విడుదలై సూపర్ సక్సెస్ సాధించిన మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్. సూర్య హీరోగా నటించిన ఈ మూవీకి గౌతమ్ వాసుదేవ్ దర్శకత్వ బాధ్యతలు వహించక సమీరా రెడ్డి ,దివ్య స్పందన, సిమ్రాన్ కీలక పాత్రలు పోషించారు. విడుదలైన దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈ చిత్రం తిరిగి ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం ఈ మధ్యనే కొన్ని రోజులు రీ రిలీజ్ కాగా..అప్పుడు స్పందన బాగా వచ్చింది.. అందుకే మళ్ళీ వాలెంటైన్స్ డే సందర్భంగా మరోసారి రిలీజ్ చేస్తున్నారు.

సిద్ధార్థ.. షామిలి కాంబినేషన్లో వచ్చిన ఓయ్ చిత్రం కూడా ఫిబ్రవరి 14న రీ రిలీజ్ కాబోతోంది. సాడ్ ఎండింగ్ ఉన్న ఈ చిత్రం అప్పట్లో ఫ్లాప్ అయినప్పటికీ ఈ మూవీకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా ఈ మూవీ మ్యూజిక్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంది.ఇక పవన్ కళ్యాణ్ తొలిప్రేమ మూవీకి లవర్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమికుల రోజు సందర్భంగా తిరిగి విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్ బుకింగ్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసాయి. ఇక వీటన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గత ఏడాది బ్లాక్ బస్టర్ ‘సీతారామమ్’ కి సైతం ప్రత్యేక ప్రీమియర్లకు రెడీ చేస్తున్నారు.

పనిలో పనిగా హాలీవుడ్ రొమాంటిక్ లవర్ మూవీ టైటానిక్ కూడా ప్రేమికులను పలకరించడానికి వస్తుంది. వీటితో పాటుగా కొత్త తమిళ్ డబ్బింగ్ మూవీ ట్రూ లవర్ కూడా కేవలం లవర్స్ డే కలెక్షన్స్ ని నమ్ముకొని బరిలోకి దిగుతోంది. ఇన్ని ఆప్షన్స్ మధ్య లవర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఇక లవర్స్ డిసైడ్ చేసుకోవాలి.

Also Read: Eagle Twitter Review: ఈగల్ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్‌పై మాస్ మహారాజా దాడి

Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News