Siri Shannu Romance : షన్నుతో చేసిన రొమాన్స్ మీద నోరు విప్పిందా?.. తప్పు ఒప్పుకున్న సిరి.. స్టేజ్ మీదే ఏడుపులు

Siri Cries Infront of Shrihan బిగ్ బాస్ షోతో సిరి, శ్రీహాన్, షన్ను, దీప్తిల జీవితాలు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసిందే. ఐదో సీజన్‌లో షన్నుతో కలిసి సిరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరూ కలిసి చేసిన రొమాన్స్‌కు జనాలు షాక్ అయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2023, 05:51 PM IST
  • బుల్లితెరపై సిరి షన్నుల రచ్చ
  • బిగ్ బాస్ షోతో రిలేషన్స్ బ్రేకప్
  • శ్రీహాన్ ముందే ఏడ్చేసిన సిరి
Siri Shannu Romance : షన్నుతో చేసిన రొమాన్స్ మీద నోరు విప్పిందా?.. తప్పు ఒప్పుకున్న సిరి.. స్టేజ్ మీదే ఏడుపులు

Love Today Promo బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నులు చేసిన రచ్చకు రెండు తెలుగు రాష్ట్రాలు నోరెళ్లబెట్టాయి. ఈ ఇద్దరికీ బయట లవర్స్ ఉన్నా కూడా బిగ్ బాస్ ఇంట్లో హద్దులు దాటేశారు. షన్ను కోసం దీప్తి, సిరి కోసం శ్రీహాన్ బయట ఉన్నారు. అయినా కూడా సిరి, షన్నులు మాత్రం హగ్గులు, ముద్దులంటూ నానా రచ్చ చేశారు. సిరి తల్లి అయితే షన్నుతో దూరంగా ఉండు.. అన్నలాంటి వాడు అని చెప్పి.. హింట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా కూడా సిరి బుద్ది మారలేదు.

షన్నుని వదిలి పెట్టలేదు. అలానే కంటిన్యూ చేసింది. సిరి ముద్దులు, హగ్గులతో షన్ను లైఫ్ పూర్తిగా మారిపోయింది. బయటకు వచ్చిన తరువాత దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. కొన్ని రోజులు సిరి, శ్రీహాన్‌లు కూడా మాట్లాడుకున్నట్టుగా కనిపించలేదు. చివరకు రవి ఇంట్లో సిరి, శ్రీహాన్‌లు కలిసినట్టుగా ఓ ఫోటో బయటకు వచ్చింది.

అలా బిగ్ బాస్ షోతో రెండు జంటల మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సిరి, శ్రీహాన్‌లు బాగానే కలిసి ఉన్నారు. శ్రీహాన్ ఆరో సీజన్‌లో ఉండగా.. బయట నుంచి సిరి బాగానే సపోర్ట్ చేసింది. శ్రీహాన్ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన సిరి.. లిప్ లాక్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. ఒంటి మీద టాటూ కూడా వేయించుకుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News