Shriya saran : వామ్మో ఇదేం రచ్చ.. తల్లైనా తగ్గట్లేదు.. అర్దనగ్నంగా శ్రియా!

Shriya saran latest photoshoot హీరోయిన్ శ్రియా నెట్టింట్లో ఎంత హంగామా చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె చేసిన బోల్డ్ ఫోటో షూట్ చూసి అంతా షాక్ అవుతున్నారు.  

Last Updated : Oct 1, 2022, 04:57 PM IST
  • నెట్టింట్లో శ్రియా హంగామా
  • ఫోటో షూట్లతో హీరోయిన్ రచ్చ
  • అర్దనగ్నంగా పోజులు పెట్టిన భామ
Shriya saran : వామ్మో ఇదేం రచ్చ.. తల్లైనా తగ్గట్లేదు.. అర్దనగ్నంగా శ్రియా!

Shriya saran latest photoshoot : టాలీవుడ్ కథనాయికల్లో ఇప్పుడు ఎవ్వరూ కూడా ఏడాది రెండేళ్లు కూడా లైమ్ లైట్లో ఉండలేకపోతోన్నారు. కానీ ఒకప్పుడు హీరోయిన్లు దశాబ్ద కాలం పాటుగా టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతూ వచ్చేవారు. త్రిష, శ్రియ వంటి వారు తెలుగులో దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్లు కొనసాగారు. ఇప్పటికీ వీరికి మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ ఇద్దరూ తెలుగు, తమిళం అంటూ ఫుల్ బిజీగా మారిపోయారు. శ్రియా అయితే బాలీవుడ్లోనూ అదరగొట్టేసింది. ఇప్పుడు శ్రియాకు సెకండ్ ఇన్నింగ్స్ నడుస్తోంది. పెళ్లై, తల్లైనా కూడా సినిమాల మీద ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. తన ఫిజిక్‌‌‌ను మెయింటైన్ చేస్తోంది. ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది.

శ్రియా పిక్స్

శ్రియా ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తన భర్త ఆండ్రూ కొశ్చీవ్, పాప రాధలతో కలిసి శ్రియా ఎంజాయ్ చేస్తోంది. ఎప్పుడూ వెకేషన్లో శ్రియా ఎంజాయ్ చేస్తుంటుంది. బీచులంటూ తన ఫ్యామిలీతో తిరుగుతుంటుంది. తన పాపను కూడా బీచ్ ఒడ్డున ఆడిస్తుంటుంది. బికినీలో శ్రియా షేర్ చేసే ఫోటోలు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తుంటాయి. శ్రియా తన భర్తతో కలిసి దిగే ఫోటోలు, షేర్ చేసే వీడియోల ఔరా అనిపిస్తాయి. పబ్లిక్‌గానే రొమాన్స్ చేసేస్తుంటారు. శ్రియా వీడియోలు ఎంత నాటీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆండ్రూ సైతం వీడియోల్లో రెచ్చిపోతోంటాడు.

శ్రియా ప్రస్తుతం చేస్తోన్న సినిమాల కంటే.. సోషల్ మీడియాలో చేస్తోన్న సందడితోనే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. శ్రియా చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలేవీ లేవు. ఆర్ఆర్ఆర్ సినిమాతో శ్రియా చివరగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అంతకు ముందు అంటే.. గత ఏడాది గమనం అనే సినిమాతో థియేటర్లో సందడి చేసింది.

అయితే శ్రియా మాత్రం ఇప్పుడు హిందీ ప్రేక్షకులను దృశ్యం 2 సినిమాతో పలకరించనుంది. అజయ్ దేవగణ్, శ్రియా కాంబోలో వచ్చిన వచ్చిన మొదటి పార్ట్ హిందీలోనూ వర్కవుట్ అయింది. ఇక ఇప్పుడు కూడా ఈ సినిమాను హిందీలో భారీ రేంజులో విడుదల చేస్తున్నారు. ఇక శ్రియా నెట్టింట్లో తన అందాల ఆరబోతను మాత్రం ఆపడం లేదు.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలను చూసి జనాలు అవాక్కవుతున్నారు. అర్దనగ్నంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది.. కానీ తన అందాలను మాత్రం ఎంతో తెలివిగా కనిపించకుండా కవర్ చేసేసుకుంది. చీరలో ఇలా కనిపించడం మాత్రం శ్రియాకే సొంతం అన్నట్టుగా చూపించేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ మాత్రం నెట్టింట్లో మంటలు పుట్టించేస్తోంది.

Also Read : పవన్ కళ్యాణ్ బూట్ల రేట్లపై చర్చ.. పిక్స్ వైరల్

Also Read : Trisha Krishnan Hot Pics: అబ్బబ్బ ఏమందంరా బాబు.. దేవకన్యలా మెరిసిపోతున్న త్రిష!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News