/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

షారుఖ్ ఖాన్.. గత 25 ఏళ్లుగా హిందీ చిత్రసీమలో తనదైన శైలిలో రాణిస్తున్న సూపర్ స్టార్.  దాదాపు 80 సినిమాలు.. 14 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు.. పలు అంతర్జాతీయ పురస్కారాలు.. వీటన్నింటికీ మించి అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా.. ఐపీఎల్ జట్టు కెప్టెన్‌గా.. నిజజీవితంలోనూ భిన్న పాత్రలు పోషించిన నటుడు షారుఖ్. అంతేకంటే ఎక్కువగా కింగ్ ఖాన్, బాలీవుడ్ కా బాద్షా.. అని అభిమానులు ఇచ్చే బిరుదులు కూడా ఆయన సొంతం. అయితే ఇవ్వన్నీ అంత తేలికగా రాలేదు ఈ మధ్య తరగతి కుర్రాడికి.. షారుఖ్ జీవన ప్రస్థానం నిజంగానే ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రోజు ఆయన 52వ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం మీకోసం

2 నవంబరు 1965లో ఢిల్లీలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు షారుఖ్ ఖాన్. ఆయన చిన్నతనమంతా తన తాతయ్య ఇఫ్తికర్ అహ్మద్ వద్దే గడిచింది. ఆయన పూర్వీకులు పాకిస్తాన్ నుండి వలస వచ్చిన పఠానులు. షారుఖ్ తండ్రి మీర్ తాజ్ మహ్మద్ ఖాన్ పెషావర్‌లో నివసిస్తున్న సమయంలో భారత స్వాతంత్య్రం కోసం, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించిన కార్యకర్త. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ప్రేరణతో స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన మీర్, 1948లో భారత్‌, పాక్ విడిపోయాక ఢిల్లీకి వచ్చేశారు. షారుఖ్ తల్లి ఒక హైదరాబాదీ. షారుఖ్ చిన్నతనమంతా ఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో గడిచింది. ఆయన తండ్రి అదే ప్రాంతంలో ఒక రెస్టారెంట్ నడుపుతుండేవారు. సెయింట్ కొలంబియా స్కూలు విద్యార్థైన షారుఖ్ చిన్నప్పటి నుండే హాకీ, ఫుట్‌బాల్ క్రీడలలో బాగా రాణించేవాడు. 1981లో షారుఖ్ తండ్రి మరణించారు. 

1985లో ఢిల్లీలోని హన్స్ రాజ్ కాలేజీలో చదువుతున్న రోజులలోనే తొలిసారిగా షారుఖ్‌కి నటనపై ఆసక్తి కలిగింది. అప్పటికే ఆయన స్టేజీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. డ్రామా క్లబ్బుల్లో సభ్యుడిగా ఉండేవారు. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ వాయిస్‌లను మిమిక్రీ చేసేవారు. డిగ్రీ అయిపోయాక కొన్నాళ్లు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్స్ డిగ్రీ చేసిన షారుఖ్, తల్లి కూడా చనిపోవడంతో కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. చదువును కూడా మధ్యలోనే ఆపేశారు. కుటుంబ బాధ్యత కూడా తనమీదే పడింది. అటువంటి సందర్భంలో తొలిసారిగా "ఫౌజీ" అనే టీవీ సీరియల్‌లో నటించిన షారుఖ్ ఆ తర్వాత సర్కస్, ఇడియట్ అనే రెండు సీరియల్స్‌లో కూడా నటించారు. అయితే ఆయన తొలుత సీరియల్స్‌లో మాత్రమే  నటించాలని అనుకున్నారట.

సినిమాల్లోకి రావడానికి ముందు ఆయన చాలా ఆలోచించాల్సి వచ్చింది. అందుకు ముఖ్య కారణం గౌరీ అనే అమ్మాయిని తను ప్రేమించడం. పంజాబీ హిందూ అమ్మాయైన గౌరీ చిబ్బర్‌ను పెళ్లిచేసుకోడం కోసం షారుఖ్ ఆమె కుటుంబాన్ని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు 1991లో ఆమెను వివాహం చేసుకున్నారు. అలాంటి సందర్భంలో సినిమాల్లోకి రావడం రిస్క్‌యేమో అనుకున్న షారుఖ్‌, గౌరీ ప్రోత్సాహంతో ఆమెను పెళ్లి చేసుకున్న సంవత్సరమే తొలిసారిగా "దిల్ ఆస్నా హై" సినిమాకి సైన్ చేశారు. అయితే తొలిసారిగా విడుదల అయిన సినిమా "దీవానా".

దీవానా సినిమా విడుదలయ్యాక, షారుఖ్ కెరీర్ గ్రాఫ్ అనతికాలంలోనే ఊపందుకుంది. డర్, బాజీగర్ లాంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలు కూడా పోషించారు షారుఖ్. 1995లో దాదాపు ఏడు సినిమాలకు షారుఖ్ సైన్ చేయడం విశేషం. దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే సినిమాలో షారుఖ్, కాజోల్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఆ తర్వాత ప్రతీ సంవత్సరం ఏదో ఒక్క షారుఖ్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ప్రారంభించింది. దిల్ తో పాగల్ హై (1997), కుచ్ కుచ్ హోతా హై (1998), మొహబ్బతే (2000), దేవదాస్ (2002), కల్ హో నహో (2003), మై హూ నా (2004), వీర్ జారా (2004), డాన్ (2006), చక్ దే ఇండియా (2007), ఓం శాంతి ఓం (2007), రబ్ నే బనా దీ జోడీ (2008) చిత్రాలు షారుఖ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయాయి. 

తాను నటించిన తొలి సినిమా "దీవానా"కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న  షారుఖ్,  ఆ తర్వాత దాదాపు 8 సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అందుకున్నారు. 1993 నుండి 2003 సంవత్సరం వరకు డ్రీమ్స్ అన్ లిమిటెడ్ పేరుతో నిర్మాణసంస్థను స్థాపించి సినిమాలు కూడా తీశారు షారుఖ్. ఆ తర్వాత రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే మరో సంస్థను స్థాపించారు. ఆ తర్వాత పలు అవార్డు ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు షారుఖ్. ఫిల్మ్‌ఫేర్, జీ, సినీ, స్క్రీన్ అవార్డులకు హొస్ట్‌గా పాల్గొన్నారు.

2007లో అమితాబ్ బచ్చన్ స్థానంలో "కౌన్ బనేగా కరోడ్‌పతి" ప్రోగ్రామ్‌కి షారుఖ్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం జరిగింది. 2008లో ఐపీఎల్ ఆక్షన్‌లో పాల్గొని కోలకతా నైట్‌రైడర్స్ జట్టును కొనుగోలు చేశారు షారుఖ్. 2012, 2014ల్లో అదే జట్టు ఛాంపియన్‌గా నిలవడం విశేషం. 

అంతర్జాతీయంగా కూడా షారుఖ్‌కు దక్కిన పేరు ప్రఖ్యాతులు అన్ని ఇన్ని కావు. టైమ్ పత్రిక షారుఖ్‌ను టాప్ 20 ఆసియన్ హీరోలలో ఒకరిగా ఎంపిక చేసింది. బ్రిటీష్ ఆసియన్ గిల్డ్ పురస్కారం కూడా అందుకున్న భారతీయ నటుడు కూడా షారుఖే. ఫ్రెంచ్ ప్రభుత్వం దేశ అధికారిక పురస్కారమైన "ఆర్డర్ ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ లిటరేచర్" అందించి  షారుఖ్‌ని సత్కరించింది. 2007లో షారుఖ్ మైనపు విగ్రహాన్ని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నెలకొల్పారు. 66 గోల్డన్ గ్లోబ్ పురస్కారాల్లో ముఖ్య అతిథిగా షారుఖ్ హాజరయ్యారు. ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం షారుఖ్‌కు గౌరవ డాక్టరేటు ఇచ్చి సత్కరించింది. 

Section: 
English Title: 
Sharukh Khan Birth Anniversary
News Source: 
Home Title: 

ఒక బాద్షా... ఒక కింగ్ ఖాన్.. ఒక షారుఖ్

ఒక బాద్షా... ఒక కింగ్ ఖాన్.. ఒక షారుఖ్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes