Shaakuntalam in December: సమంత 'శాకుంతలం' విడుదలకు రంగం సిద్దం.. ఎప్పుడంటే?

Shaakuntalam Movie Getting Ready to Release on December: డిసెంబర్ తొలి వారంలో శాకుంతలం సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 22, 2022, 08:35 PM IST
Shaakuntalam in  December: సమంత 'శాకుంతలం' విడుదలకు రంగం సిద్దం.. ఎప్పుడంటే?

Shaakuntalam Movie Getting Ready to Release on December: చాలా కాలం క్రితం అనుష్కతో రుద్రమదేవి అనే సినిమా చేసిన గుణశేఖర్ ఆ తర్వాత మరో సినిమా చేయడానికి చాలా సమయం పట్టింది. సమంత హీరోయిన్గా శాకుంతలం అనే సినిమాని ఆయన ఇప్పటికే రూపొందించారు. ప్రస్తుతానికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు కానీ డిసెంబర్ తొలి వారంలో శాకుంతలం సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఆసక్తికరంగా గుణశేఖర్ తెరకెక్కించారని తెలుస్తోంది. దీనిని స్వీయ నిర్మాణంలో గుణశేఖర్ రూపొందించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అర్హ ఒక కీలక పాత్రలో నటిస్తుండడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు, అనసూయ పాత్రలో అదితి బాలన్ నటిస్తున్నారు. ఒక రాక్షసుడి పాత్రలో కబీర్ దుల్హన్ సింగ్ నటిస్తుండగా మేనక పాత్రలో మధు నటిస్తున్నారు.

అల్లు అర్జున్ కుమార్తె అర్హ భరతుడి చిన్ననాటి పాత్రలో కనిపిస్తోంది. ఇక ప్రకాష్ రాజ్ కన్వర్షి అనే ఒక మహర్షి పాత్రలో కనిపించబోతున్నారు. సమంత మొట్టమొదటిసారిగా ఒక రాకుమారి పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో సహజంగానే అంచనాలు ఏర్పడుతున్నాయి. తమ ప్రమోషన్స్ తో ఆ అంచనాలను రెట్టింపు చేయడానికి గుణశేఖర్ అండ్ టీం ఇప్పుడు కష్టపడుతున్నారు. ఇక ప్రస్తుతానికి సమంత విషయానికి వస్తే ఆమె చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

దానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం విదేశాలకు వెళ్లారని అంటున్నారు. ఇక ఈ వారంలో ఆమె చికిత్స పూర్తి చేసుకుని విదేశాల నుంచి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తిరిగి వచ్చిన తర్వాత ఆమె నటించిన యశోద సినిమాకి సంబంధించిన తెలుగు తమిళ డబ్బింగ్ పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు.  శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హరీష్ నారాయణ్, హరి శంకర్ అనే ఇద్దరి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సినిమా మీద ఆసక్తి పెంచేసింది. 
 Also Read: Kalyan Ram on Name Change: పేరు మార్చడం నాకు బాధ కలిగించింది.. ఇలా వాడుకోవడం తప్పు!

Also Read: Chandrababu Fires on Jr NTR: ఎన్టీఆర్ కి, వైఎస్ఆర్ కి పోలికా ? సిగ్గు ఉండాలి..బాబు ఘాటు కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News