Shaakuntalam vs Dasara: దారుణంగా 'శాకుంతలం'.. నాని సినిమా 20వ రోజు కలెక్షన్స్ క్రాస్ చేయలేక పోయిందిగా!

Shaakuntalam vs Dasara Collections: సమంతా హీరోయిన్ గా నటించిన శాకుంతలం, నాని హీరోగా నటించిన దసరా సినిమాలు ఇప్పుడు థియేటర్లలో ఉండగా ఈ రెండు సినిమాల మధ్య కంపెరిజన్స్ తీసుకొచ్చి రచ్చ చేస్తున్నారు ట్రేడ్ వర్గాల వారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 19, 2023, 07:57 PM IST
Shaakuntalam vs Dasara: దారుణంగా 'శాకుంతలం'.. నాని సినిమా 20వ రోజు కలెక్షన్స్ క్రాస్ చేయలేక పోయిందిగా!

Shaakuntalam Collections vs Dasara Collections: సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా దారుణమైన డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతున్నట్లుగా ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శకుంతల పాత్రలో నటించిన ఈ సినిమాకి గుణశేఖర్ స్వయంగా నిర్మాతగా వ్యవహరించారు. దిల్ రాజు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాని తెలుగుతో సహా తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సైతం రిలీజ్ చేశారు.

కానీ ఈ సినిమాకి మొదటి నుంచి డివైడ్ టాక్ రావడంతో ఆ టాక్ కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తోంది. ఈ సినిమా ఐదు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కోటి ఎనిమిది లక్షల వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు 51 లక్షలు, మూడవరోజు 46 లక్షలు, నాలుగో రోజు 20 లక్షలు, ఐదో రోజు 12 లక్షలు వెరసి రెండు కోట్ల 37 లక్షల షేర్, 4 కోట్ల డెభై లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా తమిళంలో 33 లక్షలు, కర్ణాటక సహా మిగతా రాష్ట్రాల్లో 36 లక్షలు, ఓవర్సీస్ లో 98 లక్షలు, మొత్తం కలిపి నాలుగు కోట్ల నాలుగు లక్షల షేర్, 8 కోట్ల 40 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

Also Read: IT Raids On Mythri: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ ఇళ్లపై రైడ్స్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల హ్యాండ్ కూడా?

సినిమా బిజినెస్ 18 కోట్ల రూపాయలకు జరగడంతో 19 కోట్లు వసూలు చేస్తే హిట్ అవుతుంది. కానీ ఇంకా 14 కోట్ల 96 లక్షల వసూలు చేయాల్సి ఉంది, అది జరగడం అసాధ్యమని అంటున్నారు. నిజానికి ఈ సినిమా కంటే ముందు విడుదలైన నాని హీరోగా నటించిన దసరా సినిమా ఇప్పటికీ మంచి జోరు చూపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదల ఇప్పటికి 20 రోజులు పూర్తయ్యాయి.

20వ రోజు అంటే ఈ సినిమా మంగళవారం నాడు 13 లక్షలు వసూలు చేసింది, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అదే రోజు శకుంతలం సినిమా తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అంటే నాని సినిమా 20వ రోజు కూడా 13 లక్షలు వసూలు చేస్తే 5వ రోజే సమంత సినిమా ఆ సినిమా కంటే లక్ష రూపాయలు తక్కువగా వసూలు చేయడం హాట్ టాపిక్ అవుతుంది. ఇక సమంత శాకుంతలం సినిమా విషయానికొస్తే దారుణమైన డిజాస్టర్ దిశగా పయనిస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాని మొత్తం 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తే సగం వరకు స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే థియేటర్ రిలీజ్ కంటే ముందు శాటిలైట్ డీల్ పూర్తి కాకపోవడంతో ఇప్పట్లో ఆ డీల్ మంచి రేటుకి క్లోజ్ అవ్వడం కష్టమే అని తెలుస్తోంది. దాదాపుగా ఈ సినిమా తెరకెక్కించి రిలీజ్ చేసినందుకుగాను గుణశేఖర్ కి 20 కోట్ల వరకు నష్టం చేకూరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Also Read: Trishara then &now: 'సినిమా బండి'లో స్కూల్ పిల్ల ఇప్పుడు ఎలా తయారయిందో చూశారా? అరాచకం అంటే ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News