SSMB 28 Movie: మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో నాటి మేటి నటి రీఎంట్రీ, ఆమె ఎవరో తెలుసా

SSMB 28 Movie: ఖలేజా తరువాత మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా మరోసారి తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కొత్త స్కెచ్ వేస్తున్నాడట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 1, 2022, 08:36 PM IST
SSMB 28 Movie: మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో నాటి మేటి నటి రీఎంట్రీ, ఆమె ఎవరో తెలుసా

టాలీవుడ్‌లో ఇద్దరు అగ్రగణ్యుల కాంబినేషన్ సినిమాపై ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. 12 తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడవ సినిమా ఇది. ఇప్పుడీ సినిమా కోసం వెటెరన్ సీనియర్ నటిని రంగంలో దింపుతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ నటి ఎవరు, ఆమె పాత్ర ఏంటనేది తెలుసుకుందాం.

మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే అందరికీ ఆసక్తి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 2005లో వచ్చిన అతడు సూపర్ డూపర్ హిట్ అయితే..2010లో విడుదలైన ఖలేజా ఎందుకో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు 12 ఏళ్ల విరామం అనంతరం మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్..మహేశ్ బాబుతో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా విభిన్నంగా ఉండేందుకు త్రివిక్రమ్ కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండేట్టు చేయడం త్రివిక్రమ్ ప్రత్యేకత.

ఇప్పుడీ సినిమాలో కూడా కొత్తదనం తీసుకొచ్చేందుకు త్రివిక్రమ్ ఇప్పటికే ప్లాన్ సిద్దం చేశాడు. 2023 ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఓ వైపు షూటింగ్ జరుగుతున్నా..ఇంకా నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా కన్పించనుంది. మలయాళం, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సిద్ధం కానుందని సమాచారం. మహేశ్ బాబు కెరీర్‌లో ఇది 28వ సినిమా.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సూర్యదేవర రాధాకృష్ణ నిర్మాతగా ఉన్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.

పీరియాడిక్ డ్రామా నేపధ్యంగా ఉండే ఈ సినిమాలో మహేశ్ బాబు రెండు విభిన్న పాత్రల్లో కన్పించనున్నాడు. ఇప్పుడీ సినిమాలో కొత్తదనం కోసం వెటెరన్ సీనియర్ నటిని తీసుకొస్తున్నారు. సినిమాలో కీలమైన మహేశ్ బాబు తల్లి పాత్రలో ఆమెను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ పాత్ర కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ నాటి మేటి నటి శోభనను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా కీలకపాత్రలో కన్పించనున్నారు.

Also read: Rakul preet singh: అభ్యంతరకర పాత్రలో రకుల్ ప్రీత్‌సింగ్ బోల్డ్ సినిమా, అవకాశాల్లేకేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News