Sekhar Master : ఢీ షోలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. స్టేజ్‌కు దండం పెడుతూ ఎమోషనల్

Sekhar Master Re Entry to Dhee ఢీ పదిహేనో సీజన్‌లో మళ్లీ శేఖర్ మాస్టర్ వచ్చాడు. పద్నాలుగో సీజన్‌ మధ్యలోనే శేఖర్ మాస్టర్ బయటకు వచ్చాడు. అయితే ఇక పూర్తిగా ఢీ నుంచి దూరమయ్యాడని అంతా అనుకున్నారు. కానీ ఈ కొత్త సీజన్‌లో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 07:02 PM IST
  • ఢీ పదిహేనో సీజన్ ప్రోమో వైరల్
  • చాంపియన్ బాటిల్ షిప్ అంటూ రచ్చ
  • శేఖర్ మాస్టర్ రీ ఎంట్రీతో అంతా ఖుష్
Sekhar Master : ఢీ షోలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. స్టేజ్‌కు దండం పెడుతూ ఎమోషనల్

Dhee 15 Championship Battle promo బుల్లితెరపై ఢీ షోకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. మల్లెమాల నుంచి వచ్చిన ఈ ప్రొడక్ట్ ఇప్పటికీ హై స్పీడులో దూసుకుపోతోంది. ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా, ఎంతగా ట్రోలింగ్ జరిగినా, ఢీ అనేది డ్యాన్స్ షో కాదు.. కామెడీ షో అయిందంటూ ఎంతగా నెగెటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాగానే టీఆర్పీ రేటింగ్‌లు సాధిస్తోంది. ఇక ఇందులో ఎన్నెన్నో మార్పులు వచ్చేశాయి. జడ్జ్‌లు కాన్‌స్టంట్‌గా ఉండటం లేదు. మారుతూనే ఉన్నారు. టీం లీడర్లు మారుతున్నారు. కానీ ఒక్క హోస్ట్ ప్రదీప్ మాత్రం మారడం లేదు.

ఎన్ని సీజన్లు వస్తున్నా వెళ్తున్నా ప్రదీప్ మాత్రం హోస్ట్‌గా కంటిన్యూ అవుతున్నాడు. ఇక శేఖర్ మాస్టర్, బాబా భాస్కర్, గణేష్ మాస్టర్ ఇలా అందరూ మారుతూ వచ్చారు. లేడీ జడ్జ్‌లో ప్రియమణి వెళ్లిపోయింది. మధ్యలో నందితా వచ్చి వెళ్లింది. శ్రద్దా దాస్ కూడా మధ్యలో కనిపించింది. అయితే ఇప్పుడు ప్రారంభం అయిన కొత్త సీజన్లో శ్రద్దా దాస్ జడ్జ్‌గా వచ్చింది. శేఖర్ మాస్టర్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News