Polimera 2 OTT: అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ‘'పొలిమేర 2'’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Polimera 2 Movie; సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్‌ 'మా ఊరి పొలిమేర 2' ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం. ఈ చిత్రం పొలిమేర సీక్వెల్ గా తెరకెక్కింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2023, 05:30 PM IST
Polimera 2 OTT: అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ‘'పొలిమేర 2'’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Polimera 2 ott Release date: సత్యం రాజేష్ టైటిల్ రోల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్‌ 'మా ఊరి పొలిమేర 2' ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ కు ఊహించని స్పందన వచ్చింది. తీవ్ర పోటీ మధ్య ఈ చిత్ర ఓటీటీ హక్కులను తెలుగు ఫేమస్ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. దీని కోసం భారీ మెుత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మేకర్స్ ముందుగానే మేకర్స్ ప్రకటించారు. కానీ ఒక్క రోజు ముందుగానే ఓటీటీలోకి తీసుకొచ్చి షాకిచ్చారు. అయితే ఈ రోజు మూవీ చూడాలనుకున్నవారు 'ఆహా గోల్డ్' మెంబర్‌షిప్‌ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ మెంబర్‌షిప్ ఉన్న వాళ్లు డిసెంబర్ 8వ తేదీ నుంచి ఆహాలో మూవీని వీక్షించవచ్చు. 

నవంబర్ 3న ప్రేక్షకులకు ముందు వచ్చిన ఈ చిత్రంలో సత్యంరాజేష్ తోపాటు కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు. జ్ఞాని అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు అదిరింది. గతంలో 2021లో వచ్చిన మా ఊరి పొలిమేర చిత్రానికి సిక్వెల్‏గా పొలిమేర 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ ఈ సినిమాకు థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్  వచ్చింది. మరి ఈ మూవీని వెండితెరపై మిస్ అయినా వారు ఆహా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ మధ్య మూఢనమ్మకాలు, చేతబడులకు సంబంధించిన చిత్రాలు ఓ రేంజ్ లో ఆడుతున్నాయి. తాజాగా ఆ సక్సెస్ ను పొలిమేర 2 కంటిన్యూ చేసింది.

Also Read: Animal Box Office: బాక్సాఫీస్ పై కొనసాగుతున్న రణ్‌బీర్ దండయాత్ర... రూ.500 కోట్ల క్ల‌బ్‌లో 'యానిమల్'... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News