Sara Tendulkar: రొమాంటిక్ డేట్‌కు వెళ్లిన సారా టెండూల్కర్.. ఇంతకు ఆమె చేయి పట్టుకుంది ఎవరు?

సారా టెండూల్కర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలలో సారా చేయిని మరొకరు పట్టుకున్నారు. డేట్‌ నైట్ అని రాసుండడం మరింత ఆసక్తిని పెంచింది. ఈ పోస్ట్ చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 01:02 PM IST
  • రొమాంటిక్ డేట్‌కు వెళ్లిన సారా టెండూల్కర్
  • సారా టెండూల్కర్ చేయి పట్టుకుంది ఎవరు
  • రొమాంటిక్ డేట్‌లో సచిన్ కూతురు
Sara Tendulkar: రొమాంటిక్ డేట్‌కు వెళ్లిన సారా టెండూల్కర్.. ఇంతకు ఆమె చేయి పట్టుకుంది ఎవరు?

Sara Tendulkar goes on a date night with singer Kanika Kapoor: క్రికెట్​ దిగ్గజం సచిన్​ టెండూల్కర్ (Sachin Tendulkar)​ కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సచిన్ తన ఆటతో అందరి మనసులు కొల్లగొడితే.. సారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. లండన్ కాలేజ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివిన సారా.. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబందించిన పోటోలను ఎప్పటికప్పుడూ షేర్‌ చేస్తూ.. అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఏ ఫోటో షేర్ చేసినా అది నిమిషాల్లో వైరల్‌ అవుతుంటుంది. ఈ క్రమంలో తాజాగా సచిన్ తనయ పోస్ట్ చేసిన ఓ ఫొటో క్షణాల్లో వైరల్ అయింది. 

సారా టెండూల్కర్ (Sara Tendulkar) తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలలో సారా చేయిని మరొకరు పట్టుకున్నారు. డేట్‌ నైట్ (Date Night) అని రాసుండడం మరింత ఆసక్తిని పెంచింది. ఈ పోస్ట్ చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మరికొంత సమయానికి బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ (Kanika Kapoor) కూడా ఓ పోస్ట్ చేసింది. అందులో సారా టెండూల్కర్ ఆమె చేయి పట్టుకుంది ఉంది. దాంతో అసలు విషయం బయటపడింది. సారా చేయిని పట్టుకుంది మరెవరో కాదు కనికా కపూర్ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: IND vs NZ: అందుకే న్యూజీలాండ్‌ను కోహ్లీ ఫాలోఆన్‌ ఆడించలేదు.. అసలు విషయం చెప్పేసిన భారత ప్లేయర్!!

మ్నారోవైపు సారా టెండుల్కర్‌ (Sara Tendulkar)తో టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ప్రేమలో పడ్డాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా ఖాతాలలో ఒకరి పోస్టులకు ఒకరు కామెంట్‌ చేస్తూ.. కాస్త స్నేహంగా ఉన్నట్లు కనిపించడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అటు గిల్‌ కానీ, ఇటు సారా కానీ ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా గిల్ ఓ ఫొటో షేర్‌ చేయడంతో మరోసారి వీరిద్దరి లవ్ మ్యాటర్ తెరపైకి వచ్చింది. గిల్ కంటే సారా రెండేళ్లు పెద్దది. సారాకు 24 ఇళ్ళు కాగా.. గిల్‌కు 22 ఏళ్లు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News