Samantha: మెగాస్టార్ తో డెబ్యూ ఇవ్వబోతున్న సమంత.. కాంబినేషన్ మామూలుగా లేదుగా !

Samantha in Malayalam: సమంత మళ్ళీ ఎప్పుడెప్పుడు సినిమాలతో.. బిజీ అవుతుందా అని.. అభిమానులు కళ్ళుకాయలు కాచేలా.. ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు మాయాళంలో కూడా హీరోయిన్ గా.. అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 14, 2024, 12:43 PM IST
Samantha: మెగాస్టార్ తో డెబ్యూ ఇవ్వబోతున్న సమంత.. కాంబినేషన్ మామూలుగా లేదుగా !

Samantha Upcoming Projects: గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో.. బాధపడుతున్న.. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత.. ఈమధ్య అసలు వెండితెరపై కనిపించడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ నుండి సమంతకి.. ఆఫర్లు రావడం కూడా తగ్గిపోయింది. చాలాకాలం తర్వాత ఖుషి సినిమాలో కనిపించిన సమంత.. పర్వాలేదు అనిపించింది.. కానీ బ్లాక్ బస్టర్ అయితే అందుకోలేకపోయింది.

ఇక సమంత కెరీర్ కి శుభం కార్డు పడిపోయిందా.. అని కూడా కొందరు కామెంట్లు మొదలుపెట్టిన సమయంలో.. ఈ స్టార్ బ్యూటీ బాలీవుడ్ లో ప్రాజెక్ట్ సైన్ చేసి షాక్ ఇచ్చింది. వరుణ్ ధావన్ సరసన సిటాడేల్.. అనే వెబ్ సిరీస్ లో నటించే అవకాశం అందుకుంది ఈ భామ. 

మరి ఈ ప్రాజెక్ట్ తో అయినా సమంత కెరియర్ కీలక మరుపుతిరుగుతుందో.. లేదో వేచి చూడాలి. ఇప్పటికే తెలుగు, తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత.. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది. అయితే తాజాగా ఇప్పుడు సమంత మలయాళంలో కూడా తన సత్తా చాటబోతున్నట్లుగా.. వార్తలు వినిపిస్తున్నాయి.

ఏకంగా కేరళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో.. ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఒక యాక్షన్ థ్రిల్లర్ లో సమంత హీరోయిన్ గా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మమ్ముట్టితో కలిసి సమంత ఒక కమర్షియల్ యాడ్ లో కనిపించింది.. కానీ ఇద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే. 

అసలు ఏ మాయ చేసావే సినిమాతో.. సమంతని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా గౌతమ్ మీననే. మళ్లీ ఇన్నాళ్లకు గౌతమ్ దర్శకత్వంలో ఇప్పుడు మలయాళంలో కూడా అడుగుపెట్టబోతోంది సమంత. 

మమ్ముట్టి స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఇక ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తోంది. తక్కువ షెడ్యూల్స్ లో.. సినిమాని పూర్తి చేసి త్వరగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది.

ఇక మరోవైపు సమంత.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ఒక నిర్మాణ సంస్థను స్థాపించింది. తన స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం.. అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది సమంత. మరి ఈ సినిమాతో సమంత ఎంతవరకు మళ్లీ ట్రాక్ లో పడుతుందో చూడాలి.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News