Yashoda Movie Review : యశోద రివ్యూ.. సమంత.. మోసింది భారమంతా

Yashoda Movie Review సమంత యశోద సినిమాతో తన సత్తా చాటేందుకు థియేటర్లోకి వచ్చింది. నేడు అంటే నవంబర్ 11న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 01:09 PM IST
  • నేడు యశోద విడుదల
  • సస్పెన్స్, థ్రిల్లర్‌గా యశోద
  • అదరగొట్టేసిన సమంత
Yashoda Movie Review : యశోద రివ్యూ.. సమంత.. మోసింది భారమంతా

Samantha Ruth Prabhu Yashoda Movie Review : సమంత ప్రస్తుతం పాన్ ఇండియన్ క్రేజ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఫ్యామిలీమెన్ సీజన్ 2, పుష్ప స్పెషల్ సాంగ్‌లతో సమంతకు నేషనల్ వైడ్‌గా క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు సమంత యశోద సినిమాతో అందరి ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సమంత ఇప్పుడు యశోద అంటూ వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ
యశోదలో రెండు కథలను సమాంతరంగా నడిపిస్తుంటారు. ఒక వైపు హాలీవుడ్ నటి ఒలివియా, టాప్ మోడల్‌ ఆరూషి మరణిస్తారు. వారి మరణం వెనుకున్న రహస్యాలను చేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటారు. మరో వైపు యశోద (సమంత) తన చెల్లి ఆపరేషన్ కోసం సరోగసిని ఆశ్రయిస్తుంది. సమంత చివరకు ఈవాలో చేరుతుంది. అక్కడ మధు (వరలక్ష్మీ శరత్ కుమార్) డాక్టర్ గౌతమ్‌ (ఉన్ని ముకుందన్‌)లు ఉంటారు. ఇక ఈ కథలో సెంట్రల్ మినిస్టర్ గిరిధర్ (రావు రమేష్) పాత్ర ఏంటి? మిలటరీ ఆఫీసర్‌ వాసుదేవ్‌గా (సంపత్) చేసింది ఏమిటి? అసలు సమాంతరంగా నడిచే ఈ కథలు రెండూ ఒకే చోటకు ఎలా చేరుకుంటాయి? ఈ రెండింటికి మధ్య ఉన్న లింక్ ఏంటి? మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి? సరోగసి ముసుగులో జరుగుతున్నదేంటి? అసలు యశోద నేపథ్యం ఏంటి? చివరకు యశోద ఏం చేసింది? అనేది కథ.

నటీనటులు
యశోద సినిమాలో సమంత జీవించేసింది. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేసింది. సినిమా ప్రారంభంలో కనిపించే సమంతకు.. ఇంటర్వెల్‌లో కనిపించే సమంతకు.. క్లైమాక్స్‌లో సమంత చేసే యాక్షన్ సీక్వెన్స్‌లకు ఎంతో తేడా ఉంటుంది. సమంత ఈ సినిమాను తన భుజాల మీద మోసిసేసింది. ఇక సమంత తరువాత వరలక్ష్మీ, ఉన్ని ముకుందన్ పాత్రలకు మంచి క్రేజ్ వస్తుంది. ఈ పాత్రలపై అందరికీ ముందు కాస్త అనుమానం వచ్చినా.. అది సెకండాఫ్‌లోనే రివీల్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా శత్రు, మిలటరీ ఆఫీసర్‌గా సంపత్ చక్కగా నటించారు. మినిస్టర్‌ పాత్రలో రావు రమేష్ తన స్టైల్లో నటించేశాడు. మిగిలిన పాత్రల్లో కల్పికా గణేష్, దివ్య వంటి వారు తమ పరిధి మేరకు నటించేశారు.

 

విశ్లేషణ
హరి అండ్ హరీష్‌ ఎంచుకున్న పాయింట్, తీసుకున్న నేపథ్యం అన్నీ కొత్తగానే ఉంటాయి. పైన సరోగసి అంటూ కలరింగ్ ఇచ్చినా లోలోపల ఇంకో కొత్త పాయింట్ జోడించారు. బ్యూటీ ప్రొడక్ట్స్, అందం మీద జరిగే వ్యాపారం ఎలా ఉంటుందో చూపించారు. అయితే పాయింట్ పరంగా ఈ చిత్రం కొత్తగా అనిపిస్తుంది. కానీ తెర మీదకు వచ్చే సరికి ఎన్నో సీన్లు లాజిక్‌కు దూరంగా ఉంటాయి.

యశోద చేస్తున్నవాటిని విలన్ గ్యాంగ్ అలా చూస్తుండిపోయినట్టుగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి అంతా యశోద ఇష్టంగానే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. చుట్టూ కెమెరాలున్నా. ఎంతో సెక్యూరిటీ ఉన్నా కూడా యశోద మాత్రం తనకు నచ్చిన చోటుకి, నచ్చినట్టుగా వెళ్తుంటుంది. అలా ఎన్నెన్నో సీన్లు ఇల్లాజికల్‌గా అనిపిస్తుంటాయి.

ఇలా కొన్ని లాజిక్స్ పక్కన పెడితే.. సెకండాఫ్ మాత్రం కాస్త ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. ప్రథమార్థం మాత్రం స్లోగా సాగుతుంది. ఇక క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగుంటాయి. యశోద రియాల్టీ బయటకు వచ్చే సీన్ బాగుంటుంది. కానీ అది మనం ఇది వరకు చూసినట్టుగానే అనిపిస్తుంది. పోకిరి తరహాలో కనిపిస్తుంది. 

యశోద సినిమాకు మాటలు బాగా కలిసి వచ్చాయి. ఏ మగాళ్లకే ధైర్యం ఉంటుందా? అంటూ చివర్లో చెప్పిన డైలాగ్ బాగా పేలినట్టుగా అనిపిస్తుంది. ఉన్న ఒకటో రెండో పాటలు పర్వాలేదనిపిస్తాయి. కానీ మణిశర్మ బీజీఎం మాత్రం అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయి. కెమెరాపనితనం అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

చివరగా : యశోద రివ్యూ.. సమంత.. మోసింది భారమంతా.. లాభాలు వస్తాయా? లేదా? అన్నది చూడాలింకా

రేటింగ్ : 2.75

గమనిక : ఈ సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణం నుంచి రాయబడింది. దీన్నీ జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.

Also Read : Nachindi Girlfriendu Movie Review : నచ్చింది గాళ్‌ఫ్రెండూ మూవీ రివ్యూ.. షేర్ మార్కెట్ల మోసాలపై గురి

Also Read :Yashoda Twitter Review : యశోద ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన సమంత.. కష్టానికి తగ్గ ప్రతిఫలం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News