Samantha Fans Love : సమంతను కదిలించిన అభిమాని.. ఆ మాటలకు ఫిదా అయిన సామ్

Samantha Ruth Prabhu Emotional సమంత తాజాగా తన అభిమానుల ప్రేమను చూసి మురిసిపోయింది. తన కోసం నిలబడే అభిమానులున్నారని సమంత మురిసిపోయింది. వారి ప్రేమ వల్లే ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొంటున్నాను అని చెప్పుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 10:20 PM IST
  • నెట్టింట్లో సమంత అభిమానుల సందడి
  • సమంతను కదిలించిన ఫ్యాన్ ట్వీట్
  • అభిమానికి రిప్లై ఇచ్చిన సమంత
Samantha Fans Love : సమంతను కదిలించిన అభిమాని.. ఆ మాటలకు ఫిదా అయిన సామ్

Samantha Fans Love సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతోంది. మయోసైటిస్ కారణంగా సమంత ఎదుర్కొంటోన్న సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమంత ఇప్పుడు ఇంటికే పరిమితమైంది. బయటకు వచ్చిన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే స్థితిలో లేదు. సమంత వల్ల అటు జరగాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయి. సమంతకు అనారోగ్యం వల్ల విజయ్ చేయాల్సిన ఖుషి సినిమా ఇప్పుడు ఆగిపోయింది.

ఇక యశోద సినిమా కోసం అతి కష్టం మీద ప్రమోషన్స్ చేసింది. తన పరిస్థితి గురించి చెబుతూ కన్నీరు పెట్టేసుకుంది. అయితే సమంత ఇప్పుడు పూర్తిగా కొలుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోందట. సమంతకు రెగ్యులర్‌గా చికిత్స అందుతోంది. ఇక చికిత్స కోసం దక్షిణ కొరియాకు కూడా వెళ్లినట్టు రూమర్లు వచ్చాయి. అయితే వీటిలో ఎలాంటి నిజం లేదని సమంత టీం కొట్టిపారేసింది.

 

అయితే సమంత పరిస్థితిని చూసి అభిమానులు మాత్రం చలించిపోతోన్నారు. సమంత ఎప్పుడూ స్ట్రాంగ్ అని, ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతూనే ఉంటుందని, ఎప్పుడూ ఆశను కోల్పోవద్దని, నీ కోసం మేం ఉన్నామంటూ ఇలా సమంత అభిమాని ఓ ట్వీట్ వేశారు. సమంతను ధైర్యంగా ఉండమని, స్ట్రాంగ్ లేడీ అంటూ సమంత ఫ్యాన్ ట్వీట్ వేశారు. దీనికి సమంత స్పందించింది.

తన అభిమాని వేసిన పోస్ట్, ఇచ్చిన సపోర్ట్ చూసి సమంత చలించిపోయింది. మీ ప్రేమ, ప్రార్థన వల్లే నేను ఇంకా ఇలా ఉన్నాను అంటూ సమంత ఎమోషనల్ అయింది. మొత్తానికి సమంత కోసం అభిమానులు మాత్రం గట్టిగానే ప్రార్థనలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News