Rashmika Mandanna: రౌడీ లుక్స్ లో రష్మిక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Rashmika Mandanna Rowdy Photos: తన అందాలతో మాయ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది రష్మిక మండన్న. మరోసారి ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అదే రిపీట్ చేసింది ఈ హీరోయిన్.

1 /5

నాగశౌర్య ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రష్మిక మండన్న. మొదటి సినిమాతోనే విజయం అందుకున్న ఈ హీరోయిన్ గీతాగోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

2 /5

విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రష్మిక కెరియర్ లోనే మరుపురాని సినిమాగా మిగిలిపోయింది. ముఖ్యంగా ఈ చిత్రం నుంచి విజయ్ దేవరకొండ తో రష్మిక ప్రేమ కూడా మొదలైందనే వార్తలు ఉన్నాయి.  

3 /5

ఆ తరువాత వరుసగా తెలుగు సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది ఈ నటి. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయింది.  

4 /5

తెలుగులోనే కాకుండా ప్రస్తుతం తమిళంలో, హిందీలో కూడా ఈమెకు వరసగా అవకాశాలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడం విశేషం.

5 /5

ఈ క్రమంలో రష్మిక రౌడీ స్టైల్ లో టీ షర్ట్ వేసుకొని పైన ఒక కోట్ వేసుకొని షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో రష్మిక లేడీ రౌడీ లాగా ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.