Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..

Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు. అయితే విజయ్ దేవరకొండ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేక తన సినిమాలలో ఏమన్నా ఆఫర్ ఇస్తున్నారా అని ఇప్పుడు సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 24, 2024, 11:18 AM IST
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..

Vijay Devarkonda: కేజిఎఫ్, సలార్ సినిమాలతో అటు కన్నడలో మాత్రమే కాక ఇటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్లు అందుకుంటూ ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుకుంటున్నారు ప్రశాంత్ నీల్. కానీ ప్రశాంత్ నీల్ ఇప్పుడు వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న  యువ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

వివరాల్లోకి వెళితే స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మధ్యనే ఫిలింనగర్ లో ఉంటున్న విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారట. దీంతో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అని పుకార్లు మొదలైపోయాయి. ప్రశాంత్ నీల్ వంటి స్టార్ డైరెక్టర్ తో విజయ్ ఖచ్చితంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అభిమానులు అప్పుడే ఫిక్స్ అయిపోయారు.

ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ పార్ట్ 2 సినిమాతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమాని లైన్ లో పెట్టారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేయబోతున్నారా అని అనుమానాలు మొదలయ్యాయి.

మరికొందరైతే విజయ్ దేవరకొండ ప్రభాస్ సలార్ పార్ట్ 2 సినిమాలో క్యామియో పాత్రలో కనిపించే అవకాశం ఉందని లేదా ఎన్టీఆర్ సినిమాలోనైనా చిన్న పాత్రలో కనిపిస్తారేమోనని పుకార్లు సృష్టిస్తున్నారు. కానీ వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం లేదు.

కానీ తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి సినిమా పని మీద వెళ్లలేదని, క్యాజువల్ గా ఫ్రెండ్లీగా మాత్రమే వెళ్లారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు సరదాగానే వెళ్లి ఉండొచ్చు కానీ భవిష్యత్తులో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాదు అని చెప్పలేం. వస్తే మాత్రం అదిరిపోతుంది అని ఫాన్స్ అనుకుంటున్నారు. 

మరోవైపు వరుస డిజాస్టర్లతో విజయ్ దేవరకొండ మార్కెట్ బాగా పడిపోయింది. ఈ మధ్యనే విడుదలైన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో చతికిలబడింది. ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు.

Read More: Taslima Mohammad:సోషల్ మీడియాలో బిల్డప్ లు.. తస్లీమా మహమ్మద్ ఆస్తులు చూసి కళ్లు తేలేస్తున్న ఏసీబీ అధికారులు..

Read More: Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News