Sai Pallavi: అన్నిటికన్నా దానికి ఎక్కువ ప్రాధాన్యత.. తెగ కష్టపడుతున్న సాయి పల్లవి

Sai Pallavi Upcoming Movie: అందంతో, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన సాయి పల్లవి.. చూడడానికి అచ్చు తెలుగమ్మాయిలా ఉంటుంది. కానీ ఏ భాషలో సినిమా చేసిన ఆ భాషను తన సొంత భాష లాగా నేర్చుకొని మరి మాట్లాడగలడం ఆమె స్పెషాలిటీ. అందుకే ప్రతి ఇండస్ట్రీలో తన నేచురల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2024, 10:42 AM IST
Sai Pallavi: అన్నిటికన్నా దానికి ఎక్కువ ప్రాధాన్యత.. తెగ కష్టపడుతున్న సాయి పల్లవి

Thandel Update: సినీ పరిశ్రమలో సాయి పల్లవి అంటే సపరేట్ క్రేజ్ ఉంది. పక్కింటి అమ్మాయిల ఎంతో సహజంగా ఉండే ఆమె నటన ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆమెకు క్రేజ్ పెంచింది. నెమలి నాట్యం చేసినట్టు సాయి పల్లవి చేసే డాన్స్ యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ తీసుకువచ్చింది. 

అలా సాయి పల్లవి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని ప్రేక్షకుల మనసులో క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ఫుల్ అయింది. మొదటి మూవీ ఫిదా లో తెలంగాణ యాసతో ప్రేక్షకుల మనసును ఫీదా చేసింది. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకొని ఎంతో న్యెచురల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. దీంతో సాయి పల్లవి తెలంగాణ పిల్లగా టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయింది.

అప్పటినుంచి ఇప్పటివరకు ఏ సినిమా చేసిన సరే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం సాయి పల్లవి స్పెషాలిటీ. ఇతర భాషల్లో కూడా అదే ట్రెండ్ ని ఆమె కొనసాగిస్తుంది. ప్రస్తుతం నాగచైతన్య తో కలిసి తండేల్ మూవీలో నటిస్తున్న సాయి పల్లవి ఇందులో పక్కా పల్లెటూరి పిల్లగా కనిపించనుంది. ఉత్తరాంధ్ర జాలర్ల జీవితం నేపథ్యంలో సాగే ఈ మూవీలో ఆమె పాత్ర కోసం సాయి పల్లవి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర యాస కూడా నేర్చుకుందట. ఇందుకోసం ఒక ట్రైనర్ ను నియమించుకొని .. కష్టపడి అచ్చు శ్రీకాకుళం విజయనగరం ప్రాంతం అమ్మాయిలాగా మాట్లాడడంలో ట్రైనింగ్ తీసుకుంది.

ఈ మూవీ తో పాటు బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న రామాయ‌ణ్ చిత్రంలో సీత పాత్రకు సాయి పల్లవి ఎంపికైన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా హిందీ ని కూడా నేర్చుకుంటుంది సాయి పల్లవి. సీత పాత్ర ఎంతో పవిత్రమైనది.. ఇందులో ఆమె పలికే పదాలు.. ఉచ్చరించే తీరు.. ఎలా ఉంటాయి అన్న విషయంపై సాయి పల్లవి ప్రత్యేక దృష్టి పెట్టి చిత్రం కోసం ప్రిపేర్ అవుతోంది. ఈ విషయానికి సంబంధించి ఓ హిందీ ట్రైనర్ ని కూడా నియమించుకుంది. ఇలా ఏ భాషలో సినిమా చేసినా.. ఏ యాసాలో మాట్లాడాల్సి వచ్చినా.. సాయి పల్లవి తనని తాను రెడీ చేసుకుంటూ వస్తోంది. తెలుగు, తమిళం ,మలయాళం లాంటి భాషలు ఇప్పటికే నేర్చుకున్న సాయి పల్లవి ప్రస్తుతం హిందీ ని కూడా ఆట ఆడేస్తోంది. సాయి పల్లవి లో ఉన్న ఈ స్పెషల్ క్వాలిటీ.. టాలెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు

Also Read: Bus Yatra: చంద్రబాబు జిత్తులమారి.. పొత్తులమారి: బస్సు యాత్రలో జగన్‌ ధ్వజం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News