RRR Movie Trailer: అవతార్ ని మించిన యాక్షన్- ట్రైలర్ తో థియేటర్లలో రచ్చ లేపిన చరణ్, ఎన్టీఆర్

RRR Movie Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీస్టారర్ RRR మూవీ ట్రైలర్ గురువారం విడుదల అయ్యింది. ఉదయం థియేటర్లలో సందడి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ (RRR Movie) ఇప్పుడు సోషల్ మీడియానూ విడుదలైంది. సినిమా విడుదలైన గంట తర్వాత ట్రైలర్ ను నెట్టింట రిలీజ్ చేసింది చిత్రబృందం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 01:16 PM IST
RRR Movie Trailer: అవతార్ ని మించిన యాక్షన్- ట్రైలర్ తో థియేటర్లలో రచ్చ లేపిన చరణ్, ఎన్టీఆర్

RRR Movie Trailer: జక్కన్న వెండితెరపై చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) కళాఖండానికి సంబంధించిన మచ్చుతునక విడుదలైంది. గురువారం ఉదయం 10 గంటలకు థియేటర్లలో విడుదలైన చిత్ర ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రిలీజ్ (RRR Trailer Release) అయ్యింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ కు రెట్టింపుగా సోషల్ మీడియా ట్రెండింగ్ నడుస్తోంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమ అభిమాన హీరోలను వెండితెరపై అదుర్స్ అనిపించేలా విజువల్స్ ఉన్నాయని అన్నారు. 

ట్రైలర్ చూస్తున్నంత సేపు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ వెండితెరపై జీవించేశారు. ‘‘భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

స్వాతంత్ర సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలు ఆధారంగా ఫిక్షనల్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి. యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అలరించగా.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి నుంచి రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి.

దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ (RRR Movie Trailer) చిత్రాన్ని నిర్మించారు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య. ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలుగా నటించారు. వీరితో పాటు అజయ్ దేవగణ్, శ్రియ, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ (RRR Trailer Release) మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ (RRR Movie Release Date) కానుంది.

Also Read: RRR Trailer Review: RRR ట్రైలర్ లో ఇది గమనించారా..? రామ్ Vs భీమ్ ఫైట్ సీక్వెన్స్

Also Read: RRR Movie Censor Report: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’.. మూవీ రన్ టైమ్ ఎంతంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News