RRR Movie : ప్రేక్షకులను మోసం చేయను.. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌లో రెండు క్యారెక్టర్‌‌లు పవర్‌‌ఫుల్ : రాజమౌళి

SS Rajamouli On Ajay Devgn, Alia Bhatt's Roles : రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ఆర్ఆర్‌‌ఆర్ మూవీలోని ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రలపై మాట్లాడారు. సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రలు రెండూ ఎంతో కీలకమైనవి చెప్పుకొచ్చారు జక్కన్న. తాను ప్రేక్షకులను మోసం చేయదలుచుకోలేదు అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 09:09 AM IST
  • ఆర్ఆర్‌‌ఆర్ మూవీలోని ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రలపై డైరెక్టర్ రాజమౌళి స్పందన
  • ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రలు ఎంతో కీలకమైనవి..
  • అజయ్ దేవగన్ పాత్ర ఆత్మలాంటిది..
  • అలియా భట్ పోషించిన సీత పాత్ర మరింత కీలకం...
RRR Movie : ప్రేక్షకులను మోసం చేయను.. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌లో రెండు క్యారెక్టర్‌‌లు పవర్‌‌ఫుల్ : రాజమౌళి

RRR Movie update: RRR Director SS Rajamouli says not going to cheat audience as he shares detail about Ajay Devgn, Alia Bhatt’s roles : జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అన్ని భాషల్లో ప్రచార జోరును పెంచేసింది మూవీ యూనిట్. ఈ క్రమంలో డైరెక్టర్ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ఆర్ఆర్‌‌ఆర్ మూవీలోని ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రలపై మాట్లాడారు. 

ఆర్ఆర్ఆర్ మూవీలో ఏ పాత్ర అయినా ఆ పాత్ర నిడివిపై ఆధారపడి ఉండదని డైరెక్టర్ రాజమౌళి (Director Rajamouli) చెప్పారు. సినిమాలో ఆలియా భట్, (Alia Bhatt) అజయ్ దేవగన్ పాత్రలు (Ajay Devgn) రెండూ ఎంతో కీలకమైనవి చెప్పుకొచ్చారు జక్కన్న. ఆర్ఆర్‌‌ఆర్ మూవీని (RRR Movie) ఒక దేహంలా చూస్తే, సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర ఆత్మలాంటిది అని అన్నారు రాజమౌళి. సినిమాలో రెండు పవర్‌హౌస్‌లులాంటి క్యారెక్టర్లు (RRR Movie Characters) ఉన్న విషయం తెలిసిందే.. వాటిని బ్యాలెన్స్ చేయగలిగేలా ఉండే క్యారెక్టరే అలియా భట్ పోషించిన సీత (Alia Bhatt Sita) పాత్ర అని రాజమౌళి చెప్పారు.

"ఆలియా భట్, అజయ్ దేవగన్ ఇద్దరూ ఆర్ఆర్ఆర్ మూవీలో అతిథి పాత్రలు పోషిస్తున్నారు.. ఈ విషయంలో నేను ప్రేక్షకులను మోసం చేయదలుచుకోలేదు.. క్యారెక్టర్ ప్రియార్టీ విషయానికొస్తే.. వారి పాత్రలు మిగతా పాత్రలకు సమానంగా ఉంటాయి.. కొన్ని సీన్లలో హీరోల కంటే ఎక్కువగా వారి పాత్రలే చాలా బలంగా కనిపిస్తాయి" అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

Also Read : Quinton de Kock: క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్

భావోద్వేగం.. విప్లవం.. భారతీయ సంస్కృతి..సమ్మేళనంగా తెరకెక్కింది ఆర్‌ఆర్‌ఆర్ మూవీ. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కాంబోలో వస్తోన్న ఈ మూవీ 2022 జనవరి 7న రిలీజ్ కానుంది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది ఈ మూవీ.ఆర్ఆర్‌‌ఆర్ మూవీలో (RRR Movie) అల్లూరి సీతారామరాజు పాత్రలో.. రామ్ చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఆలియాభట్‌, ఒలివియా మోరిస్‌ హీరోయిన్స్. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి మ్యూజిక్ అందించారు.

 

Also Read : Heavy rain in Chennai: చెన్నైలో వర్ష బీభత్సం.. ముగ్గురు మృతి.. 4 జిల్లాలకు రెడ్ అలర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News