RRR Movie Pre-Release Event: హైదరాబాద్ టు దుబాయ్.. భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్ టీమ్

RRR Movie Pre-Release Event: ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి భారీ స్థాయిలో ప్రమోషన్ ఈవెంట్లు ప్లాన్ చేశారు. 18వ తేదీన హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రమోషన్స్.. తిరిగి 23వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్‌ ఈవెంట్‌తో ముగియనున్నాయి. దేశంలోని పలు పెద్ద నగరాలతో పాటు దుబాయ్‌లోనూ  ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 04:46 PM IST
  • 18వ తేదీన హైదరాబాద్‌ నుంచి ప్రారంభం కానున్న ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ఈవెంట్స్
  • దేశం నలుమూలలా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్
  • దుబాయ్‌లోనూ ఈవెంట్స్ ప్లాన్ చేస్తోన్న జక్కన్న, దానయ్య
RRR Movie Pre-Release Event: హైదరాబాద్ టు దుబాయ్.. భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్ టీమ్

RRR Movie Pre-Release Event: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరెకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్‌ఆర్. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే భారీగా ప్రమోషన్ ఈవెంట్లు ప్లాన్ చేశారు. 18వ తేదీన హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రమోషన్స్ 23వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్‌ ఈవెంట్‌తో ముగియనున్నాయి.

18వ తేదీన హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ సంబరాలు దుబాయ్ వరకు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి యూనిట్ 19న బెంగళూరు చేరుకోనున్నారు. 20వ తేదీన బరోడాలోనూ భారీ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అదే 20వ తేదీన ఢిల్లీలోనూ ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

ఢిల్లీనుంచి 21వ తేదీన చిత్ర బృందం అమృత్‌సర్ చేరుకోనుంది. అదే రోజు రాజస్థాన్‌లోని జైపూర్ వెళ్లి భారీ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. జైపూర్ నుంచి వెళ్లి 22వ తేదీన కోల్‌కతాలో జరిగే ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. అక్కడ్నుంచి అదే రోజు వారణాసి వెళ్లనున్నారు. వారణాసి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుని 23న ఆర్ఆర్ఆర్ మూవీ గ్రాండ్ ప్రి రిలీజ్ ఈవెంట్ (RRR Movie latest updates) నిర్వహించనున్నారు.

Also read : Ghani Movie Trailer: 'ఈ బాక్సర్ కు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు'.. గని మూవీ ట్రైలర్ రిలీజ్!

Also read : Allu Arjun- Rajamouli: బన్నీతో రాజమౌళి మూవీ.. సినీ వర్గాల్లో హాట్​ టాపిక్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News