RRR Ramcharan Poster: రోరింగ్ రాంచరణ్... ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయిన కొత్త పోస్టర్

RRR Ramcharan Poster: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రాంచరణ్ అల్లూరి పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్ విడుదలైంది. ఇందులో రాంచరణ్ రోరింగ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 04:43 PM IST
  • ఆర్ఆర్ఆర్‌ నుంచి రాంచరణ్ కొత్త పోస్టర్ విడుదల
  • అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్న చరణ్ రోరింగ్ లుక్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్స్
RRR Ramcharan Poster: రోరింగ్ రాంచరణ్... ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయిన కొత్త పోస్టర్

RRR Ramcharan Poster: ఆర్ఆర్ఆర్ నుంచి ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ ఆతృతను తీర్చేలా ఆర్ఆర్ఆర్ మేకర్స్ వరుస అప్‌డేట్స్‌తో అభిమానుల ముందుకొస్తున్నారు. ట్రైలర్ రిలీజ్‌కు (RRR) ముందు కొత్త పోస్టర్లతో అభిమానులను ఎంగేజ్ చేస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్‌లో రాంచరణ్ (Ramcharan Tej) అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రాంచరణ్ రోరింగ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నేటి ఉదయం విడుదలైన ఎన్టీఆర్ 'భీమ్' కొత్త పోస్టర్ కూడా అభిమానులకు తెగ నచ్చేసింది.

దర్శక దిగ్గజం రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' లో రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే ఇప్పటివరకూ విడుదలైన గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదల చేసిన ఎన్టీఆర్, రాంచరణ్ పోస్టర్లు కూడా అప్పుడే వైరల్‌గా మారాయి.

స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్​ జీవిత కథలకు ఫిక్షన్ జోడించి పీరియాడికల్ డ్రామాగా ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో ఈ ఇద్దరు ఎక్కడా తారసపడనప్పటికీ... ఆ అద్భుతాన్ని రాజమౌళి తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు మన్యం వీరుల కథను ఒకేసారి తెరపై ఆవిష్కరించడం సాహసమనే చెప్పాలి. ఈ విషయంలో జక్కన్న ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 9న విడుదలవనుండగా... వచ్చే జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: Indian 2 Movie: ఇండియన్ 2 హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా..కాజల్ స్థానంలో
 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News