Prabhas new business: పెట్టుబడి లేకుండానే కొత్త వ్యాపారంలోకి ప్రభాస్..అదే పెట్టుబడిగా!

Prabhas new business: ప్రభాస్ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన హోటల్ బిజినెస్ లోకి దిగుతారని అంటున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2022, 06:26 PM IST
  • కొత్త వ్యాపారంలోకి ప్రభాస్
  • ఆ దేశాల్లో ప్రారంభించే అవకాశం
  • పెట్టుబడి లేదు కానీ అదే పెట్టుబడిగా
Prabhas new business: పెట్టుబడి లేకుండానే కొత్త వ్యాపారంలోకి ప్రభాస్..అదే పెట్టుబడిగా!

Prabhas to invest in new business: మన హీరోలు హీరోయిన్లు మాత్రమే కాదు సినీ నటులు అందరూ తాము సంపాదించిన డబ్బును ఏదో ఒక రకంగా పెట్టుబడులు పెడుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే ఇప్పటికే తెలుగు హీరోలు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ వంటి వారు ఒకపక్క సినీ హీరోలుగా రాణిస్తూనే మరోపక్క పలు రకాల వ్యాపారాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. బట్టలు బిజినెస్ మొదలు హోటల్ వ్యాపారాలు, సినిమా హళ్ళ నిర్మాణం వరకు తెలుగు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ హీరోల బాటలో ప్రభాస్ కూడా నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పటికే తన స్నేహితులతో కలిసి నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద థియేటర్ నిర్మించారు.

ఇప్పుడు ఆయన కొన్ని హోటల్స్ నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది కూడా భారత దేశంలో కాదు విదేశాలలో. దుబాయ్ స్పెయిన్ వంటి టూరిజం ఆధారిత ప్రాంతాల్లో ఆయన హోటల్స్ నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో ఆయన పెట్టుబడి మాత్రం నామమాత్రంగానే ఉంటుందని ఆయన స్నేహితులు పెట్టుబడి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రభాస్ ఇమేజ్ వాడుకుని ఈ హోటల్స్ కు క్రేజ్ తీసుకురావడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

ఈ హోటల్ కి బాహుబలి లాంటి పాపులర్ పేర్లు పెట్టి ప్రభాస్ తో ఓపెనింగ్ చేయించి తద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కెరీర్ పరంగా ప్రభాస్ చివరిగా బాహుబలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కలెక్షన్ల పరంగా ఓకే అనిపించింది కానీ కధా పరంగా నిరాశపరిచింది. ఇక రాధేశ్యామ్ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మరోపక్క ఆయన వరుస సినిమాలు లైన్ లో పెట్టిన నేపథ్యంలో ముందుగా ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది? ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది.

Also Read: Kiraak RP: మల్లెమాల సంస్థపై ఆర్పీ దారుణ వ్యాఖ్యలు.. తల్లి కాదు అంతా వ్యాపారమే.. జైలు తిండే నయమంటూ!

Also Read: Goutham Raju: గౌతమ్ రాజు కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సాయం.. అండగా ఉంటామని హామీ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు,   వినోదం,   రాజకీయాలు,   విద్య,   ఉద్యోగాలు,   హెల్త్,   లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter ,   Facebook
 

Trending News