Rashmika remuneration: వరుస హిట్ సినిమాలతో రెమ్యునరేషన్​ పెంచేసిన రష్మిక మందాన్న!

Rashmika remuneration: రష్మిక మందన్న వరుస హిట్​లతో రెమ్యునరేషన్​ పెంచేసిందా? కొత్త సినిమాకు రష్మిక అడుగుతున్న రెమ్యునరేషన్ ఎంత? అనే విషయంపై టాలీవుడ్ గాసిప్స్​ మీకోసం..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 01:26 PM IST
  • వరుస హిట్​లతో రష్మికకు పెరిగిన డిమాండ్
  • రెమ్యునరేషన్​ పెంచేసిన కన్నడ బ్యూటీ
  • ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీ..
Rashmika remuneration: వరుస హిట్ సినిమాలతో రెమ్యునరేషన్​ పెంచేసిన రష్మిక మందాన్న!

Rashmika remuneration: వరుస హిట్​ సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ హీరోయిన్​ రష్మిక మందన. కెరీర్​ ప్రారంభం నుంచి రష్మకన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద హిట్​ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. దీనితో రష్మికకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా అమె ఖాతాలో గత ఏడాది వచ్చిన పుష్ప 'మూవీ' కూడా చేరింది.

గత ఏడాది డిసెంబర్​లో విడుదలైన 'పుష్ప' సినిమా అల్లు అర్జున్ కెరీర్​లో తొలి పాన్ ఇండియా సినిమా కాగా... అది బాక్సాఫీస వద్ద రికార్డులు సృష్టించింది. ఆ సినిమా ద్వారా అల్లు అర్జున్​తో పాటు రష్మికకూ మంచి పేరు వచ్చింది. దీనితో ఇప్పుడు రష్మికకు అన్ని భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయి. దీనితో ఈ అమ్మడు.. అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రెమ్యునరేషన్ పెంచేసిందట.

కొత్తగా ఆమెను తమ సినమా కోసం అడుగుతున్న నిర్మాతలు, దర్శకుల నుంచి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని టాలీవుడ్ వర్గాల టాక్​. గీతా ఆర్ట్స్​ నుంచి ఓ ఫిమెల్​ లీడ్ సినిమాకోసం రష్మికకు పిలుపు రాగా.. రూ.2-3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అడిగిందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకోసం.. గీతా ఆర్ట్స్​ రష్మికకు అన్ని కోట్లు ఓకే చెప్పిందా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

రష్మిక గురించి..

రష్మిక మందాన్న 2016లో వచ్చిన కన్నడ మూవీ కిరిక్​ పార్టీ సినిమాతో సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అంజనీ పుత్ర, చమక్​ అనే సినిమాల్లో మెరిసింది. 

ఆ తర్వాత 2018లో వచ్చిన ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అదే సంవత్సరం వచ్చిన గీత గోవిందం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం తెలుగులో ఆడవారు మీకు జోహార్లు, పుష్ప 2 సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు.. హిందీలో రెండు సినిమాల్లో హీరోయిన్​గా చేస్తోంది.

Also read: Janhvi Kapoor Latest Photos: కవ్వించే ఫోటోలతో కేక పెట్టిస్తున్న జాన్వి కపూర్

Also read: Bigg Boss Brothal House: బిగ్‌బాస్ హౌస్ ఒక బ్రోతల్ హౌస్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News