Rama Rao on Duty first look: రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ లుక్ పోస్టర్

Rama Rao on Duty Movie first look poster: కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్ ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు రామా రావు ఆన్ డ్యూటీ అనే టైటిల్‌నే ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఇవాళ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని (Rama Rao on Duty Movie first look poster) విడుదల చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 12, 2021, 09:13 PM IST
Rama Rao on Duty first look: రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ లుక్ పోస్టర్

Rama Rao on Duty Movie first look poster: క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మార్కెట్‌లో మాస్ మహారాజ రవితేజకు మళ్లీ డిమాండ్ ఏర్పడింది. క్రాక్ తర్వాత రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి మూవీ (Khiladi movie) చేస్తున్న రవితేజ.. ఉగాది పండగ సందర్భంగా మరో సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. 

కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్ ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు రామా రావు ఆన్ డ్యూటీ అనే టైటిల్‌నే ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఇవాళ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని (Rama Rao on Duty Movie first look poster) విడుదల చేసింది. రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని గమనిస్తే.. రవితేజ (Ravi Teja) పోషిస్తున్న బి.రామారావు అనే పాత్ర పేరుతోనే ప్రమాణ స్వీకార పత్రం, ఆయనకు కేటాయించిన ప్రభుత్వ వాహనం, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అనే బోర్డులను బ్యాగ్రౌండ్‌లో చూడవచ్చు.

Also read : Jr NTR Movie: జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా అక్టోబర్‌లో ప్రారంభం

ఈ సినిమాలో నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా.. రవితేజ సరసన మజిలీ మూవీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ (Actress Divyansha Kaushik) జంటగా నటిస్తోంది. ఆర్టీ టీమ్ వర్క్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రామా రావు ఆన్ డ్యూటీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచింది.

Also read : Roar Of RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్, జులై 15న గెట్ రెడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News