RRR Day 2 Collections: బాక్సాఫీస్‌ వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రభంజనం.. రెండోరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

RRR Movie Day 2 Box Office Collections. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్లు రాబట్టగా.. రెండోరోజు రూ.110-120 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు సమాచారం. మొత్తంగా ఈ రెండు రోజుల్లో రూ.340-350 కోట్లు వచ్చాయట. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2022, 01:39 PM IST
  • దేశమంతటా 'ఆర్‌ఆర్‌ఆర్‌' మేనియా
  • బాక్సాఫీస్‌ వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రభంజనం
  • రెండోరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
RRR Day 2 Collections: బాక్సాఫీస్‌ వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రభంజనం.. రెండోరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

RRR Movie Day 2 Box Office Collections: ప్రస్తుతం దేశమంతటా 'ఆర్‌ఆర్‌ఆర్‌' మేనియా నడుస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని చూసేందుకు ప్రతిఒక్కరు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దాంతో థియేటర్లలో జాతర వాతావరణం నెలకొంది. వెండితెరపై రామ్ చరణ్, ఎన్టీఆర్ దోస్తీ చూసి సినీ ఫాన్స్ ఫిదా అవుతున్నారు. కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్రలో చ‌ర‌ణ్ జీవించారు.  ఈ రెండు పాత్రలు అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. దాంతో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రికార్డ్స్ తిరగరాస్తూ దూసుకుపోతోంది.

మెగా, నందమూరి ఫ్యామిలీ హీరోల రేర్ కాంబినేష‌న్‌ కారణంగా అడ్వాన్స్‌ బుకింగ్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా.. తొలి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్లు రాబట్టింది. నిన్న శనివారం కావడంతో కలెక్షన్ల సునామీ ఆగలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ.110-120 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు సమాచారం. మొత్తంగా రెండు రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం రూ.340-350 కోట్ల మార్క్‌ను అధిగమించినట్లు తెలుస్తోంది.

హిందీలో తొలి రోజు రూ.18 కోట్లు రాబట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రెండో రోజు మాత్రం ఏకంగా రూ.24 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందట. వీకెండ్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వారం రోజుల పాటు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ అయ్యాయట. 

ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా చూస్తుంటే.. ఇక రికార్డులన్నీ ఈ సినిమా పేరుతోనే ఉండనున్నాయి. బాహుబలిని మించిన కలెక్షన్స్ వచ్చినా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌ల‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ త‌దిత‌రులు న‌టించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

Also Read: Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయిన స్టార్ బ్యాటర్! ఏబీడీకి ఛాన్స్!!

Also Read: CSK vs KKR Turning Point: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అంతా జడేజానే చేశాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News