Ram Charan: RC16 విషయంలో బుచ్చిబాబు అష్టకష్టాలు.. అదే కారణమా!

RC16: ఎప్పటినుంచో షూటింగ్ కొనసాగుతున్న గేమ్ ఛేంజర్ త్వరలో కంప్లీట్ కాబోతుండడంతో చెర్రీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ఉప్పెన ఫేమ్  బుచ్చిబాబుతో చెర్రీ చేయబోతున్న 16 వ మూవీ మంచి స్పోర్ట్స్ ప్యాక్ డ్రాప్ తో సాగుతుంది అన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తేవడానికి మేకర్ సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2024, 09:53 AM IST
Ram Charan: RC16 విషయంలో బుచ్చిబాబు అష్టకష్టాలు.. అదే కారణమా!

Buchi Babu Sana: ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అతని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ మహా అంటే మరొక రెండు నెలల్లో పూర్తవుతుంది. అనుకోని కారణాలవల్ల ఈ ఒక్క ప్రాజెక్ట్ చాలా టైం తీసుకుంది. ఇక ఇది పూర్తి అయిన వెంటనే ఆలస్యం చేయకుండా నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం రామ్ చరణ్ రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్  16 వ చిత్రానికి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి.

సినిమాకి సంబంధించిన సపోర్టింగ్ క్యాస్ట్ కోసం యాక్టర్స్ ను ఎంచుకునే పనిలో చిత్ర బృందం చాలా బిజీగా ఉంది. దీనికోసం కొత్త వాళ్లతో కూడా ఆడిషన్స్ తీసుకుంటున్నారు. అయితే మూవీకి సంబంధించిన హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా అలియా భట్ ను అప్రోచ్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్, ఆలియా కాంబో మంచి హిట్ అయింది.. పైగా ఈ చిత్రంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. సెంటిమెంట్ అనుకున్నారో ఏమో ఈ మూవీకి ఆలియా భట్ అయితే బాగుంటుంది అని అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఆలియా భట్ కు ఉన్న కమిట్మెంట్స్ దృశ్య ఆమె ఈ మూవీ ఒప్పుకోలేదట.
ఈ మూవీ లో హీరోయిన్ గా సమంతను తీసుకుంటారు అని ప్రచారం కూడా కొద్ది రోజులు సాగింది. అయితే అది కూడా కేవలం గాసిప్ మాత్రమే అని తెలుస్తోంది. 

కాగా ఈ మూవీకి ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే.. మూవీ మొత్తం ఉత్తరాంధ్ర నేపథ్యంలో .. పక్క పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఇందులో  క్యారెక్టర్స్ కు స్ట్రాంగ్ నేటివిటీ టచ్ ఉండాలి అని భావించడంతో ఆర్టిస్టులను చాలా వరకు అక్కడ వాళ్ళని తీసుకునే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ కూడా పల్లెటూరు నేటివిటీ ఉట్టిపడే విధంగా ఉండాలి. పూర్తి గ్లామర్ హీరోయిన్ ఈ రోల్ కు సెట్ కాదు. అందుకే బుచ్చిబాబు అస్సలు కాంప్రమైజ్ కాకుండా.. హీరోయిన్ కోసం చాలా ఆప్షన్స్ ను వెతుకుతున్నారట.

ఈ నేపథ్యంలో రవీనాటాండన్ కూతురు ఆడిషన్స్ కూడా తీసుకున్నారట. ఆమెకు నిర్వహించిన ఫోటోషూట్స్ ,టెస్ట్ షాట్స్ బుచ్చి బాబుకు సంతృప్తికరంగా లేవని సమాచారం. కరెక్ట్ గా చెప్పాలి అంటే బుచ్చిబాబు వెతికే హీరోయిన్ సాయి పల్లవి రేంజ్ లో ఉంటేనే సెట్ అవుతుంది. అయితే ఆమె అందుబాటులో లేదు. ఇప్పటికే సాయి పల్లవి ఖాతాలో బాలీవుడ్ లో రామాయణం.. అమీర్ ఖాన్ కొడుకు సినిమా ఉండనే ఉన్నాయి. నాగచైతన్యతో చేస్తున్న తండేల్ మూవీ కోసం చాలా కష్టం మీద పరిమితమైన కాల్ షీట్స్ ఇవ్వడానికి ఒప్పుకుంది సాయి పల్లవి. ఈ సిచువేషన్ లో బుచ్చిబాబు ఫైనల్ గా చెర్రీ పక్కన ఈ సినిమాకి హీరోయిన్ గా ఎవరిని పెడతాడు అనే విషయం పెద్ద సస్పెన్స్ గా మారింది.

Also read: Seerath Kapoor: హీట్ పుట్టిస్తోన్న సీరత్ కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్..

Also read: White Hair Problem: తెల్ల వెంట్రుకలు నల్ల బడేందుకు అద్భుతమైన చిట్కా, ఆ రెండు వస్తువులు కలిపితే చాలు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News