"రాజుగాడు" సినిమా పోస్టర్ విడుదల

  

Last Updated : Oct 22, 2017, 02:29 PM IST
"రాజుగాడు" సినిమా పోస్టర్ విడుదల
యంగ్ హీరో రాజ్‌తరుణ్ నటిస్తోన్న "రాజుగాడు" లేటెస్ట్ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు నిర్మాతలు. హీరో, హీరోయిన్ సెల్‌ఫోన్‌ను ఆమెకు తెలియకుండా దొంగతనం చేసున్నట్లు ఈ పోస్టర్‌లో కనిపిస్తుంది. సంక్రాంతి విడుదలవుతున్న ఈ చిత్రానికి సంజనారెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.  ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
అమైరా దస్తూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రాజ్‌‌తరుణ్ "అలా ఇలా" సినిమా దర్శకుడు అనీష్ క్రిష్ణతో మరో సినిమాను సైన్ చేసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోయే  ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అలాగే రాజ్‌తరుణ్ నటించిన మరోచిత్రం "పులికేక" ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
 
"ఉయ్యాల జంపాల" చిత్రంతో హీరోగా మారిన రాజ్‌తరుణ్ చేసిన "అంధగాడు" చిత్రం ఈ సంవత్సరమే విడుదలై ఏవరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మరి "రాజుగాడు" ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తాడో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. 

Trending News