Annaatthe First look: రజనీకాంత్‌ అన్నాత్తే ఫస్ట్ లుక్ అదిరింది.. పంచెకట్టులో ఆకట్టుకున్న తలైవా

Annaatthe first look: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'అన్నాత్తే' మూవీకి సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్‌లుక్‌ రిలీజైంది. పోస్టర్‌ని మూవీ యూనిట్‌ శుక్రవారం ఉదయం విడుదల చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 10, 2021, 01:57 PM IST
  • వినాయక చవితి సందర్భంగా అన్నాత్తే పోస్టర్‌‌ రిలీజ్‌
  • స్టైలిష్‌ లుక్‌లో రజనీకాంత్‌
  • నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ
Annaatthe First look: రజనీకాంత్‌ అన్నాత్తే ఫస్ట్ లుక్ అదిరింది.. పంచెకట్టులో ఆకట్టుకున్న తలైవా

Rajinikanths Annaatthe first look: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది.  రజనీ 'అన్నాత్తే' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీకి సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్‌లుక్‌ రిలీజైంది. అన్నాత్తే (Annaatthe) మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మూవీ యూనిట్‌ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. వినాయక చవితి (vinayaka chavithi) పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పోస్టర్‌‌ రిలీజ్‌ చేశారు. ఇందులో రజనీ పంచకట్టులో దసరాబుల్లోడిలా భలే ఉన్నారు. ఇక దీపావళి కానుకగా  నవంబర్ 4 న అన్నాత్తే మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి శివ దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌‌ శివ (Director siva) ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకునేలా సినిమాలను రూపొందించగలరు. శివ గతంలో తెలుగులో ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ సినిమాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. అక్కడి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

Also Read : Nani's Tuck Jagadish movie Review: 'టక్ జగదీశ్' రివ్యూ & రేటింగ్

అన్నాత్తేలో రజనీకాంత్‌కు (Rajinikanth) జోడీగా నయనతార సందడి చేయనున్నారు. కీర్తిసురేశ్‌ , మీనా, ఖుష్బూ సుందర్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. సన్‌ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News