Mahesh Babu: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్.. గడ్డం, పోనీ టైల్ తో హీరో ఫోటోలు వైరల్..!

SSMB29 Update: సూపర్ సార్ మహేష్ బాబు.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో.. త్వరలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో..తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా.. ఎయిర్ పోర్ట్ లో కనిపించిన మహేష్ బాబు తన సరికొత్త లుక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే మహేష్ బాబు సినిమాలో కూడా ఇదే లుక్ తో.. కనిపిస్తారా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 11, 2024, 03:14 PM IST
Mahesh Babu: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్.. గడ్డం, పోనీ టైల్ తో హీరో ఫోటోలు వైరల్..!

Mahesh Babu look in SSMB29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ మధ్యనే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇక ప్రస్తుతం మీ హీరో.. అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా SSMB29. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న.. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రికార్డులు సృష్టిస్తుంది అని.. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకో ఉన్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోంది.. ఈ సినిమా కథ ఏంటి.. ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు.. అంటూ సినిమాకి సంబంధించి.. ఎన్నో ప్రశ్నలు.. సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. 

తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. తాజాగా మహేష్ బాబు.. ఎయిర్ పోర్ట్ లో కొత్త లుక్ తో కనిపించారు. బాగా గడ్డం పెంచి, పోనీటైల్ కూడా వేసుకొని, క్యాప్ పెట్టుకుని మహేష్ బాబు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. దీంతో రాజమౌళి సినిమాలో.. మహేష్ బాబు ఇదే లుక్ తో కనిపించనున్నారు అని వార్తలు ఊపందుకున్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబు జైపూర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమాగా.. తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం సౌత్ ఆఫ్రికా అడవుల్లో జరగబోతుంది. ఇక మహేష్ బాబు ఈ సినిమాలో విభిన్నంగా కనిపించని ఉంది అని ముందు నుంచి ఫాన్స్ అనుకుంటున్న విషయమే. తాజాగా మహేష్ బాబు లుక్ అనుకున్న దానికంటే చాలా బాగుంది.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రముఖ మలయాళం నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో..ముఖ్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే హీరోయిన్ గా కనిపించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. 

విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథని అందించారు. అదే ఈ మధ్యనే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏమి రాలేదు అని నిరాశ చెందుతున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు లీక్ అయిన మహేష్ బాబు లుక్ తో ..కొంచెం ఊరట లభించింది అని చెప్పవచ్చు.

 

Also Read: KTR Jail: అవినీతి కేసులో కేటీఆర్‌ జైలుకు ఖాయం: బండి సంజయ్ వ్యాఖ్యలతో కలకలం

Also Read: KTR Emotinal: జైలులో కవిత దుర్భరంగా ఉంది.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్‌ ఆవేదన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News